Eedu jodulaayanu mee yitti suttarigamulu

ఈడు జోడులాయను మీ యిట్టి చుట్టరికములు
Language

(॥పల్లవి॥)
ఈడు జోడులాయను మీ యిట్టి చుట్టరికములు
వేడుకతో నీవూ నీకె వెలసితి రిపుడు

(॥ఈడు॥)
పిలుచుక వచ్చి నీకుఁ బీఁటవెట్టి విడెమిచ్చి
చెలి విన్నపము లెల్లాఁజేసుకొనెను
చెలరేఁగి నీవూ నట్టె చిత్తము గరఁగి యాకె -
తలఁపులో మెలఁగేవు తగు మీ యిద్దరికి

(॥ఈడు॥)
వినయాలు నీకుఁ జేసి విందువెట్టి తమిరేఁచి
చెనకి నిన్నొడఁబాటు సేసుకొనెను
చనవిచ్చి నీవందుకు సంతోసించి మరి యీకె -
కనుసన్న మెలఁగేవు కంటిమి మీపొందులు

(॥ఈడు॥)
పరపుపైఁ బెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి
సిరులఁ గాఁగిట లోను సేసుకొనెను
అరిది శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె -
సరవినే మెలఁగేవు సమము మీ తలఁపు

(||pallavi||)
īḍu joḍulāyanu mī yiṭṭi suṭṭarigamulu
veḍugado nīvū nīgĕ vĕlasidi ribuḍu

(||īḍu||)
pilusuga vachchi nīgum̐ bīm̐ṭavĕṭṭi viḍĕmichchi
sĕli vinnabamu lĕllām̐jesugŏnĕnu
sĕlarem̐gi nīvū naṭṭĕ sittamu garam̐gi yāgĕ -
talam̐pulo mĕlam̐gevu tagu mī yiddarigi

(||īḍu||)
vinayālu nīgum̐ jesi viṁduvĕṭṭi tamirem̐si
sĕnagi ninnŏḍam̐bāḍu sesugŏnĕnu
sanavichchi nīvaṁdugu saṁtosiṁchi mari yīgĕ -
kanusanna mĕlam̐gevu kaṁṭimi mībŏṁdulu

(||īḍu||)
parabubaim̐ bĕṭṭi nīgu pādālŏtti batti sūbi
sirulam̐ gām̐giḍa lonu sesugŏnĕnu
aridi śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ -
saravine mĕlam̐gevu samamu mī talam̐pu