ఈడు జోడైన పోలిక లిందులోనే తెలిసీని
(॥పల్లవి॥)
ఈడు జోడైన పోలిక లిందులోనే తెలిసీని
జాడలు చూడవే వొక్క సంగతయ్యే వున్నవి
(॥ఈడు॥)
పొలఁతి నెమ్మో మదె పున్నమచంద్రుఁడు వాఁడె
కల లెందు నెప్పుడో కంద మిఁకను
కలికి కన్నులు నివె కలువ రేఁకులు నివె
బలిమి యెందు వంకనో భావించవే
(॥ఈడు॥)
అంగన తురుము నిదె అలుల పౌజు లవె
సింగార మెందున్నదో చెప్పవచ్చీని
సంగడి చన్నులు నివె చక్రవాకములు నవె
యింగితాకారము లిందే యేరుపరచఁగదే
(॥ఈడు॥)
మగువ రూపము నిదె మంచి పైఁడిబొమ్మ యదె
తగఁ జక్కఁదన మేదో తానే తోఁచీని
జిగి నీపె కాఁగి లిదె శ్రీవేంకటేశుఁడు గూడె
తగులైన నేరుపులు తారుకాణసేయవే
(||pallavi||)
īḍu joḍaina poliga liṁdulone tĕlisīni
jāḍalu sūḍave vŏkka saṁgadayye vunnavi
(||īḍu||)
pŏlam̐ti nĕmmo madĕ punnamasaṁdrum̐ḍu vām̐ḍĕ
kala lĕṁdu nĕppuḍo kaṁda mim̐kanu
kaligi kannulu nivĕ kaluva rem̐kulu nivĕ
balimi yĕṁdu vaṁkano bhāviṁchave
(||īḍu||)
aṁgana turumu nidĕ alula pauju lavĕ
siṁgāra mĕṁdunnado sĕppavachchīni
saṁgaḍi sannulu nivĕ sakravāgamulu navĕ
yiṁgidāgāramu liṁde yerubarasam̐gade
(||īḍu||)
maguva rūbamu nidĕ maṁchi paim̐ḍibŏmma yadĕ
tagam̐ jakkam̐dana medo tāne tom̐sīni
jigi nībĕ kām̐gi lidĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
tagulaina nerubulu tārugāṇaseyave