Eederisanavaamdavu yeppudu neevu maanevaa

ఈడేరిచనవాఁడవు యెప్పుడు నీవు మానేవా
Language

(॥పల్లవి॥)
ఈడేరిచనవాఁడవు యెప్పుడు నీవు మానేవా
మేడెపుఁ గళలచేత మించేవుగాక

(॥ఈడే॥)
ఆయములెరిఁగి మెచ్చ నది నీవే నేరుతువు
నీయంత నేరుతునా నెలఁత నేను
చాయల నన్నేల నీవు సరులు వెట్టుకొనేవు
కాయకమైన యామేలు గట్టుకొందుగాక

(॥ఈడే॥)
పంతము చెల్లించఁగ పాడి నీవెఱుఁగుదువు
యెంతయిన నీతోడ యీడువచ్చేమా
అంతలోనే నీవు నన్ను అప్పణలేలడి గేవు
చెంత నీదొరతనమే చెల్లింతుగాక

(॥ఈడే॥)
రతులఁ జవులు చూపేరసికుఁడ వౌదువు
యితవులు దెలియనే మెంతవారము
గతియై శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి నన్ను
సతమై నీమహిమలే జట్టిగొందుగాక

(||pallavi||)
īḍerisanavām̐ḍavu yĕppuḍu nīvu mānevā
meḍĕbum̐ gaḽalaseda miṁchevugāga

(||īḍe||)
āyamulĕrim̐gi mĕchcha nadi nīve neruduvu
nīyaṁta nerudunā nĕlam̐ta nenu
sāyala nannela nīvu sarulu vĕṭṭugŏnevu
kāyagamaina yāmelu gaṭṭugŏṁdugāga

(||īḍe||)
paṁtamu sĕlliṁcham̐ga pāḍi nīvĕṟum̐guduvu
yĕṁtayina nīdoḍa yīḍuvachchemā
aṁtalone nīvu nannu appaṇalelaḍi gevu
sĕṁta nīdŏradaname sĕlliṁtugāga

(||īḍe||)
radulam̐ javulu sūberasigum̐ḍa vauduvu
yidavulu dĕliyane mĕṁtavāramu
gadiyai śhrīveṁkaḍeśha kām̐giḍam̐ gūḍidi nannu
sadamai nīmahimale jaṭṭigŏṁdugāga