Eedere nee salamulu yimka raavayyaa

ఈడేరె నీ చలములు యిఁక రావయ్యా
Language

(॥పల్లవి॥)
ఈడేరె నీ చలములు యిఁక రావయ్యా
యీడు మిగిలినవాఁడ విఁక రావయ్యా

(॥ఈడే॥)
పంతగాఁడ వౌదువు బలుదొర వౌదువు
యింతదడవు రావైతి విఁక రావయ్యా
దొంతి నున్నది వలపు దోమతెరలోపల
యింతి నీ కెదురు చూచీ నిఁక రావయ్యా

(॥ఈడే॥)
గట్టివాయ వౌదువు గద్దరీఁఢ వౌదువు
యిట్టె కానికిచ్చితిమి యిఁక రావయ్యా
పట్టి వున్నది బోనము పడఁతి మోవితేనెల
యెట్టనెదిటిమేడకు నిఁక రావయ్యా

(॥ఈడే॥)
వేడుకకాఁడ వౌదు శ్రీ వేంకటేశుఁడ వౌదువు
యీడకు రప్పించి కూడి తిఁకరావయ్యా
సూడిదె వట్టి వున్నది సుద్దు లలమేలుమంగ
యీడేరెఁ బీఁటమీఁదికి నిఁక రావయ్యా

(||pallavi||)
īḍerĕ nī salamulu yim̐ka rāvayyā
yīḍu migilinavām̐ḍa vim̐ka rāvayyā

(||īḍe||)
paṁtagām̐ḍa vauduvu baludŏra vauduvu
yiṁtadaḍavu rāvaidi vim̐ka rāvayyā
dŏṁti nunnadi valabu domadĕralobala
yiṁti nī kĕduru sūsī nim̐ka rāvayyā

(||īḍe||)
gaṭṭivāya vauduvu gaddarīm̐ḍha vauduvu
yiṭṭĕ kānigichchidimi yim̐ka rāvayyā
paṭṭi vunnadi bonamu paḍam̐ti movidenĕla
yĕṭṭanĕdiḍimeḍagu nim̐ka rāvayyā

(||īḍe||)
veḍugagām̐ḍa vaudu śhrī veṁkaḍeśhum̐ḍa vauduvu
yīḍagu rappiṁchi kūḍi tim̐karāvayyā
sūḍidĕ vaṭṭi vunnadi suddu lalamelumaṁga
yīḍerĕm̐ bīm̐ṭamīm̐digi nim̐ka rāvayyā