Eederani yatti valabemtigammaa

ఈడేరని యట్టి వలపేఁటికమ్మా
Language

(॥పల్లవి॥)
ఈడేరని యట్టి వలపేఁటికమ్మా
యీడుజోడుగాని వలపేఁటికమ్మా

(॥ఈడే॥)
తనువు తనువు గూడి తమకము మీఁద మీఁద
నినుమడించని వలపేఁటికమ్మా
మనసు మనసు తోడ మక్కళించి సందు లేక
యెనసి వుండని వలపేఁటికమ్మా

(॥ఈడే॥)
మచ్చికల చేఁతల మతి లోలురై తా
మిచ్చ యెఱుఁగని వలపేఁటికమ్మా
తచ్చనయలుకలతో ధన్యత ప్రేమల
యెచ్చకున్న యట్టి వలపేఁటికమ్మా

(॥ఈడే॥)
పంతము చెరిచి వాఁడు పానుపు మీదికి వచ్చి
యింత సేయ లేని వలపేఁటికమ్మా
కంతు నిఁకేలని శ్రీ వేంకటపతి నన్ను గూడె
నింత హెచ్చులేని వలపేఁటికమ్మా

(||pallavi||)
īḍerani yaṭṭi valabem̐ṭigammā
yīḍujoḍugāni valabem̐ṭigammā

(||īḍe||)
tanuvu tanuvu gūḍi tamagamu mīm̐da mīm̐da
ninumaḍiṁchani valabem̐ṭigammā
manasu manasu toḍa makkaḽiṁchi saṁdu lega
yĕnasi vuṁḍani valabem̐ṭigammā

(||īḍe||)
machchigala sem̐tala madi lolurai tā
michcha yĕṟum̐gani valabem̐ṭigammā
tachchanayalugalado dhanyada premala
yĕchchagunna yaṭṭi valabem̐ṭigammā

(||īḍe||)
paṁtamu sĕrisi vām̐ḍu pānubu mīdigi vachchi
yiṁta seya leni valabem̐ṭigammā
kaṁtu nim̐kelani śhrī veṁkaḍabadi nannu gūḍĕ
niṁta hĕchchuleni valabem̐ṭigammā