Eedanumde suttariga midi saaladaa

ఈడనుండే చుట్టరిక మిది చాలదా
Language

(॥పల్లవి॥)
ఈడనుండే చుట్టరిక మిది చాలదా
వాడిక సుద్దులు నీవు వదలేటివాఁడవా

(॥॥)
పలుమారు నీతోను పంతములాఁడగ రాదు
చలములు సారెసారె సాదించరాదు
పొలుపుగ నీవు నన్నుఁ బొందులు సేయుమనేవు
వొలిసినట్టు మట్టున నుండేటి వాఁడవా

(॥॥)
యెక్కువ తక్కువ నీతో నెదురు మాటాడరాదు
కక్కసించి నిన్నెంతైనాఁ గాదనరాదు
ఇక్కువ లంటుచు నన్ను నియ్య కొలుపవచ్చేవు
తక్కిన పనులు నీవు తలఁచని వాఁడవా

(॥॥)
శ్రీ వేంకటేశ్వర నీచిత్తము దెలియరాదు
వావితో నన్నేలితివి వద్దనరాదు
కావలె ననుచు నాకు గంగణము గట్టితివి
చేవదేర గూడితివి సిగ్గు పడేఁవాడవా

(||pallavi||)
īḍanuṁḍe suṭṭariga midi sāladā
vāḍiga suddulu nīvu vadaleḍivām̐ḍavā

(||||)
palumāru nīdonu paṁtamulām̐ḍaga rādu
salamulu sārĕsārĕ sādiṁcharādu
pŏlubuga nīvu nannum̐ bŏṁdulu seyumanevu
vŏlisinaṭṭu maṭṭuna nuṁḍeḍi vām̐ḍavā

(||||)
yĕkkuva takkuva nīdo nĕduru māḍāḍarādu
kakkasiṁchi ninnĕṁtainām̐ gādanarādu
ikkuva laṁṭusu nannu niyya kŏlubavachchevu
takkina panulu nīvu talam̐sani vām̐ḍavā

(||||)
śhrī veṁkaḍeśhvara nīsittamu dĕliyarādu
vāvido nannelidivi vaddanarādu
kāvalĕ nanusu nāgu gaṁgaṇamu gaṭṭidivi
sevadera gūḍidivi siggu paḍem̐vāḍavā