Eedanumde nimdaamkaa nimti mumgida

ఈడనుండె నిందాఁకా నింటి ముంగిట
Language

(॥పల్లవి॥)
ఈడనుండె నిందాఁకా నింటి ముంగిట
ఆడ నెందుఁ బోఁడుగద అప్పుడే యీకృష్ణుఁడు

(॥ఈడ॥)
యేడ పూతకిఁ జంపె నింతపిన్నవాఁడంటా
ఆడుకొనేరదే వీథి నందరుఁ గూడి
వేడుకతో మనగోవిందుఁడు గాఁడుగదా
చూడరమ్మ వీఁడు గడు చుల్లరీఁడు పాపఁడు

(॥ఈడ॥)
మరలి యప్పటివాఁడె మద్దులు విఱిచెనంటా
పరువులు వెట్టేరు పడఁతులెల్లా
కరికరించఁగ రోలఁ గట్టితే నప్పుడు మా-
హరి గాఁడుగదా ఆడనున్న బిడ్డఁడు

(॥ఈడ॥)
వింతగాఁగ నొకబండ విఱిచె నప్పటినంటా
రంతు సేసేరదివో రచ్చలు నిండి
అంత యీశ్రీవేంకటేశుఁడై న మనకృష్ణుఁడట
యింతేకాక యెవ్వరున్నా రిటువంటి పాపఁడు

(||pallavi||)
īḍanuṁḍĕ niṁdām̐kā niṁṭi muṁgiḍa
āḍa nĕṁdum̐ bom̐ḍugada appuḍe yīkṛṣhṇum̐ḍu

(||īḍa||)
yeḍa pūdagim̐ jaṁpĕ niṁtabinnavām̐ḍaṁṭā
āḍugŏnerade vīthi naṁdarum̐ gūḍi
veḍugado managoviṁdum̐ḍu gām̐ḍugadā
sūḍaramma vīm̐ḍu gaḍu sullarīm̐ḍu pābam̐ḍu

(||īḍa||)
marali yappaḍivām̐ḍĕ maddulu viṟisĕnaṁṭā
paruvulu vĕṭṭeru paḍam̐tulĕllā
karigariṁcham̐ga rolam̐ gaṭṭide nappuḍu mā-
hari gām̐ḍugadā āḍanunna biḍḍam̐ḍu

(||īḍa||)
viṁtagām̐ga nŏgabaṁḍa viṟisĕ nappaḍinaṁṭā
raṁtu seseradivo rachchalu niṁḍi
aṁta yīśhrīveṁkaḍeśhum̐ḍai na manakṛṣhṇum̐ḍaḍa
yiṁtegāga yĕvvarunnā riḍuvaṁṭi pābam̐ḍu