ఈతనిఁ జూడఁగదే యిన్నిటికీ లోనైనాఁడు
(॥పల్లవి॥)
ఈతనిఁ జూడఁగదే యిన్నిటికీ లోనైనాఁడు
యేతులాఁడి దానితోడ నెంత మొకదాకిరే
(॥ఈత॥)
సిగ్గరికత్తెకుఁ గాని సెలవి నవ్వులు రావు
యెగ్గులాఁడికిఁగాని యీసు లేదు
బగ్గడిదానికిఁగాని పచ్చిమాఁట లమరవు
వొగ్గియం దాఁకా దీనివోజ చూచేవే
(॥ఈత॥)
పంతపుదానికిఁగాని పల్లదములెల్ల రావు
జంతకుఁగాని కడుఁజలము లేదు
రంతులరాగకుఁగాని రచ్చ లలవాటు లేదు
యెంతలేదు దీనిసుద్దు లేమిచెప్పివే
(॥ఈత॥)
నాలివనితకుఁగాని ననుపులు దొరకవు
పేలరికిఁగాని రతిప్రేమ వుట్టదు
యేలే శ్రీవేంకటేశ్వరుఁ డే నల మేలుమంగను
లేవే దీనిచేఁత లేల లెక్కవెట్టేవే
(||pallavi||)
īdanim̐ jūḍam̐gade yinniḍigī lonainām̐ḍu
yedulām̐ḍi dānidoḍa nĕṁta mŏgadāgire
(||īda||)
siggarigattĕgum̐ gāni sĕlavi navvulu rāvu
yĕggulām̐ḍigim̐gāni yīsu ledu
baggaḍidānigim̐gāni pachchimām̐ṭa lamaravu
vŏggiyaṁ dām̐kā dīnivoja sūseve
(||īda||)
paṁtabudānigim̐gāni palladamulĕlla rāvu
jaṁtagum̐gāni kaḍum̐jalamu ledu
raṁtularāgagum̐gāni rachcha lalavāḍu ledu
yĕṁtaledu dīnisuddu lemisĕppive
(||īda||)
nālivanidagum̐gāni nanubulu dŏragavu
pelarigim̐gāni radiprema vuṭṭadu
yele śhrīveṁkaḍeśhvarum̐ ḍe nala melumaṁganu
leve dīnisem̐ta lela lĕkkavĕṭṭeve