ఈతనికి నీకె దగు నీతఁడే యీకెకుఁ దగు
(॥పల్లవి॥)
ఈతనికి నీకె దగు నీతఁడే యీకెకుఁ దగు
ఘాతలవి రండే తారుకాణ గానవచ్చెనే
(॥ఈత॥)
సమ్మతిఁ జేసినపొందు సంతోసమె యౌఁ గాక
నెమ్మది నందులో మరి నెర సేడదే
పమ్మినసరములు భావమునఁ బట్టుఁగా
యిమ్ముల నెంతై నాను యెర వేఁటి కౌనె
(॥ఈత॥)
ప్రేమతోఁ జూచినచూపు పెనగొని నాఁటుఁగాక
యేమైనా నందు వేసటేల కల్గునే
అనుకొన్న కూటములు యానందమే రేఁచుఁగాక
గామిడితనాల నలుగఁగ నేల యిచ్చునే
(॥ఈత॥)
యీడుజోడై నమనసు లేకములే సేసుఁగాక
అడనీడా నేల పాయఁగ నిచ్చునే
వేడుకతోడుత శ్రీవేంకటేశుఁ డీకెఁగూడె
వీడుదోడై యుండుఁగాక వొంతలేల సేసునే
(||pallavi||)
īdanigi nīgĕ dagu nīdam̐ḍe yīgĕgum̐ dagu
ghādalavi raṁḍe tārugāṇa gānavachchĕne
(||īda||)
sammadim̐ jesinabŏṁdu saṁtosamĕ yaum̐ gāga
nĕmmadi naṁdulo mari nĕra seḍade
pamminasaramulu bhāvamunam̐ baṭṭum̐gā
yimmula nĕṁtai nānu yĕra vem̐ṭi kaunĕ
(||īda||)
premadom̐ jūsinasūbu pĕnagŏni nām̐ṭum̐gāga
yemainā naṁdu vesaḍela kalgune
anugŏnna kūḍamulu yānaṁdame rem̐sum̐gāga
gāmiḍidanāla nalugam̐ga nela yichchune
(||īda||)
yīḍujoḍai namanasu legamule sesum̐gāga
aḍanīḍā nela pāyam̐ga nichchune
veḍugadoḍuda śhrīveṁkaḍeśhum̐ ḍīgĕm̐gūḍĕ
vīḍudoḍai yuṁḍum̐gāga vŏṁtalela sesune