ఈతనికి మేలుదాన విన్నిటా నీవు
(॥పల్లవి॥)
ఈతనికి మేలుదాన విన్నిటా నీవు
చేతికి లోనైవున్నాఁడు సేసవెట్టవే
(॥ఈత॥)
కొసరి కొసరి పతిఁ గొంగువట్టి దూరుకొంటా
యిసుకపాఁతరలు యేల తవ్వేవే
సొసఁగి యాతఁడు నీతోఁ బొందుసేయవచ్చినాఁడు
పసలుగా విడె మిచ్చి పాదా లొత్తవే
(॥ఈత॥)
చుట్టి చుట్టి యాతని మై సొంట్లు సోదించుకొంటా
యిట్టె సముద్రాన కేతా లెన్ని వెట్టేవే
చుట్టపు వరుస నీకు సొమ్ములియ్య వచ్చినాఁడు
గుట్టుతోడఁ బాన్పుపై గూచుండఁబెట్టుకోవే
(॥ఈత॥)
నిక్కి నిక్కి తానూ నీవూ నీటుతోఁ బెనఁగుకొంటా
దక్కి బయలువంది లెందాఁకాఁ బెట్టేవే
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నిన్నుఁగూడె
మొక్కి మొక్కి మెచ్చి మెచ్చి మోవి తేనె లియ్యవే
(||pallavi||)
īdanigi meludāna vinniḍā nīvu
sedigi lonaivunnām̐ḍu sesavĕṭṭave
(||īda||)
kŏsari kŏsari padim̐ gŏṁguvaṭṭi dūrugŏṁṭā
yisugabām̐taralu yela tavveve
sŏsam̐gi yādam̐ḍu nīdom̐ bŏṁduseyavachchinām̐ḍu
pasalugā viḍĕ michchi pādā lŏttave
(||īda||)
suṭṭi suṭṭi yādani mai sŏṁṭlu sodiṁchugŏṁṭā
yiṭṭĕ samudrāna kedā lĕnni vĕṭṭeve
suṭṭabu varusa nīgu sŏmmuliyya vachchinām̐ḍu
guṭṭudoḍam̐ bānpubai gūsuṁḍam̐bĕṭṭugove
(||īda||)
nikki nikki tānū nīvū nīḍudom̐ bĕnam̐gugŏṁṭā
dakki bayaluvaṁdi lĕṁdām̐kām̐ bĕṭṭeve
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe ninnum̐gūḍĕ
mŏkki mŏkki mĕchchi mĕchchi movi tenĕ liyyave