Eedani nela solase vemdaamkaa neevu

ఈతని నేల సొలసే వెందాఁకా నీవు
Language

(॥పల్లవి॥)
ఈతని నేల సొలసే వెందాఁకా నీవు
యేతులు నెమ్మెలుఁ జూప నిఁక నేలే చెలియా

(॥ఈత॥)
పనిలేని మాటలు బయలీఁతలు
ననుపులేని పొందులు నగుఁబాటులు
యెనయని జాగరాలు యెదురాఁకలు
కనుఁగొంటిని నీవిఁక రాఁగదవె వోచెలియా

(॥ఈత॥)
యేడ లేనియాసలు యెండమావులు
వేడుక లేని సొమ్ములు వెట్టిమోపులు
మేడమీఁది సరసాలు మేకతాఁకులు
జాడ లెరుఁగుదు దూరఁ జవిగాదె చెలియా

(॥ఈత॥)
అమరని సింగారాలు అదవదలు
తమిలేని కాఁగిళ్లు తలపోఁతలు
సమరతి శ్రీవేంకటేశ్వరుఁ డిదె నన్నుఁ గూడె
సముకాన నున్నదానఁ జలమేలె చెలియా

(||pallavi||)
īdani nela sŏlase vĕṁdām̐kā nīvu
yedulu nĕmmĕlum̐ jūba nim̐ka nele sĕliyā

(||īda||)
panileni māḍalu bayalīm̐talu
nanubuleni pŏṁdulu nagum̐bāḍulu
yĕnayani jāgarālu yĕdurām̐kalu
kanum̐gŏṁṭini nīvim̐ka rām̐gadavĕ vosĕliyā

(||īda||)
yeḍa leniyāsalu yĕṁḍamāvulu
veḍuga leni sŏmmulu vĕṭṭimobulu
meḍamīm̐di sarasālu megadām̐kulu
jāḍa lĕrum̐gudu dūram̐ javigādĕ sĕliyā

(||īda||)
amarani siṁgārālu adavadalu
tamileni kām̐giḽlu talabom̐talu
samaradi śhrīveṁkaḍeśhvarum̐ ḍidĕ nannum̐ gūḍĕ
samugāna nunnadānam̐ jalamelĕ sĕliyā