ఈతని నా పొందులు యిఁకఁ జూడవే నీవు
(॥పల్లవి॥)
ఈతని నా పొందులు యిఁకఁ జూడవే నీవు
నీతి నెక్కుడైనదాన నీకంటె నేను
(॥ఈత॥)
వట్టి మాఁకు లిగిరించ వాడికమాఁటలాడి
కట్టుకొంటివి గదే మగనిమన్నన
బట్టబయలు నవ్వుల పందిళ్లుగాఁ బెట్ట
చుట్టమువైతివి గదే సులబాల(న?) నీవు
(॥ఈత॥)
ఱాలకు గిలిగింతలు ఱట్టుగ గుబ్బలనొత్తి
ఆలవైతివిగదే యాతనికిని
గాలిబుడియలు గట్టి కలికితనాలు చూపి
వోలి గొంటివిగదే వుదుటున నీవు
(॥ఈత॥)
చెఱకునఁ బండువండ చిత్తజకళలు రేఁచి
గుఱియైతివి గదే గక్కునఁ బతికి
మఱి శ్రీవేంకటేశ్వరు మరిగించుకొంటి నేను
వెఱగందితివి గదే వేడుకతో నీవు
(||pallavi||)
īdani nā pŏṁdulu yim̐kam̐ jūḍave nīvu
nīdi nĕkkuḍainadāna nīgaṁṭĕ nenu
(||īda||)
vaṭṭi mām̐ku ligiriṁcha vāḍigamām̐ṭalāḍi
kaṭṭugŏṁṭivi gade maganimannana
baṭṭabayalu navvula paṁdiḽlugām̐ bĕṭṭa
suṭṭamuvaidivi gade sulabāla(na?) nīvu
(||īda||)
ṟālagu giligiṁtalu ṟaṭṭuga gubbalanŏtti
ālavaidivigade yādanigini
gālibuḍiyalu gaṭṭi kaligidanālu sūbi
voli gŏṁṭivigade vuduḍuna nīvu
(||īda||)
sĕṟagunam̐ baṁḍuvaṁḍa sittajagaḽalu rem̐si
guṟiyaidivi gade gakkunam̐ badigi
maṟi śhrīveṁkaḍeśhvaru marigiṁchugŏṁṭi nenu
vĕṟagaṁdidivi gade veḍugado nīvu