Eedani manasellaa nee veṟamganidaa

ఈతని మనసెల్లా నీ వెఱఁగనిదా
Language

(॥పల్లవి॥)
ఈతని మనసెల్లా నీ వెఱఁగనిదా
ఘాతల సోదించి యేల కాకుసేసేవే

(॥ఈత॥)
పొలసి యవ్వతెతోనుఁ బొందుసేయ ననఁగానే
చలపట్టి పతి నెంత సాదించేవే
అలుగననుచు నీతో నానలు వెట్టుకోఁగానే
సొలపుమాఁటలో నేల సూడు వట్టేవే

(॥ఈత॥)
మక్కువఁ గడవారితో మాటలాడననఁగానే
వెక్కసాన నీవేల వెంగెమాడేవే
చొక్కి తనమేను నీకు సోదనలియ్యఁగానే
నెక్కొని యప్పటి నేల నిందవేసేవే

(॥ఈత॥)
బెరసి నీమీఁద మరి పెండ్లాడననఁగానే
పరకాంతఁ దెచ్చి యేల పైఁదోసేవే
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
తొరలి నవ్వఁగా నేల దొమ్మి సేసేవే

(||pallavi||)
īdani manasĕllā nī vĕṟam̐ganidā
ghādala sodiṁchi yela kāguseseve

(||īda||)
pŏlasi yavvadĕdonum̐ bŏṁduseya nanam̐gāne
salabaṭṭi padi nĕṁta sādiṁcheve
alugananusu nīdo nānalu vĕṭṭugom̐gāne
sŏlabumām̐ṭalo nela sūḍu vaṭṭeve

(||īda||)
makkuvam̐ gaḍavārido māḍalāḍananam̐gāne
vĕkkasāna nīvela vĕṁgĕmāḍeve
sŏkki tanamenu nīgu sodanaliyyam̐gāne
nĕkkŏni yappaḍi nela niṁdaveseve

(||īda||)
bĕrasi nīmīm̐da mari pĕṁḍlāḍananam̐gāne
paragāṁtam̐ dĕchchi yela paim̐doseve
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
tŏrali navvam̐gā nela dŏmmi seseve