ఈతని కెదురు లేరు యెక్కడ చూచిన నిదె
(॥పల్లవి॥)
ఈతని కెదురు లేరు యెక్కడ చూచిన నిదె
చేతనే ప్రతాపముతో చెలరేఁగీ నితఁడు
(॥ఈతని॥)
దిక్కులు సాధించుటకు దేవదేవోత్తముఁ డదె
యెక్కెను తేరుమీఁద యెచ్చరికతో
చక్కాడి దనుజులను సమరములు గెలిచి
యిక్కువతో వీధి వీధి నేఁగీ నిదిగో
(॥ఈతని॥)
సకలాయుధములునుఁ జక్రము చేతులఁ బట్టి
వెకలియై శంఖము వేవేగ నాడించె
వికలులై రాక్షిసులు వీఁగి లోఁగి హతులైరి
అకలంకుఁ డీ హరి అన్నిటాను మించెను
(॥ఈతని॥)
విజయధ్వజము నదె వీఁడె శ్రీవేంకటేశుఁడు
భజన నలమేలుమంగ పలుమారు మెచ్చె నదె
త్రిజగములు నితఁడె దిక్కై కాచీ నిదె
గజబిజ లింక నుడుగరో రాక్షసులు
(||pallavi||)
īdani kĕduru leru yĕkkaḍa sūsina nidĕ
sedane pradābamudo sĕlarem̐gī nidam̐ḍu
(||īdani||)
dikkulu sādhiṁchuḍagu devadevottamum̐ ḍadĕ
yĕkkĕnu terumīm̐da yĕchcharigado
sakkāḍi danujulanu samaramulu gĕlisi
yikkuvado vīdhi vīdhi nem̐gī nidigo
(||īdani||)
sagalāyudhamulunum̐ jakramu sedulam̐ baṭṭi
vĕgaliyai śhaṁkhamu vevega nāḍiṁchĕ
vigalulai rākṣhisulu vīm̐gi lom̐gi hadulairi
agalaṁkum̐ ḍī hari anniḍānu miṁchĕnu
(||īdani||)
vijayadhvajamu nadĕ vīm̐ḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
bhajana nalamelumaṁga palumāru mĕchchĕ nadĕ
trijagamulu nidam̐ḍĕ dikkai kāsī nidĕ
gajabija liṁka nuḍugaro rākṣhasulu