Eedani gelusudagu nide vubaayamu

ఈతని గెలుచుటకు నిదే వుపాయము
Language

(॥పల్లవి॥)
ఈతని గెలుచుటకు నిదే వుపాయము
నీ తగవులెల్లాను నెరపవే నీవు

(॥ఈత॥)
మనసు వచ్చినప్పుడు మాటలాడీఁగాని తాను
మునుప నాతనికిని మొక్కవే నీవు
ననుపైనవేళను నవ్వులు నవ్వీఁగాని
వొనరఁగ వద్దనే గూచుండవే నీకు

(॥ఈత॥)
యితవైతేఁ గనక తా నింటి వచ్చీఁ గాని
చతురత సేసలు చల్లవే నీవు
తతిగొని మోవితీపు తానే చూపీఁగాని
మితిమీరఁ బొగడుచు మెచ్చవే నీవు

(॥ఈత॥)
తమకము రేఁగితేను తానే పెండ్లాడీఁ గాని
అమర నాతని గోర నంటవే నీవు
సమరతి శ్రీవేంటేశ్వరుఁ డిదె నిన్నుఁ గూడె
సముకాన చేఁతలు పచారించవే నీవు

(||pallavi||)
īdani gĕlusuḍagu nide vubāyamu
nī tagavulĕllānu nĕrabave nīvu

(||īda||)
manasu vachchinappuḍu māḍalāḍīm̐gāni tānu
munuba nādanigini mŏkkave nīvu
nanubainaveḽanu navvulu navvīm̐gāni
vŏnaram̐ga vaddane gūsuṁḍave nīgu

(||īda||)
yidavaidem̐ ganaga tā niṁṭi vachchīm̐ gāni
sadurada sesalu sallave nīvu
tadigŏni movidību tāne sūbīm̐gāni
midimīram̐ bŏgaḍusu mĕchchave nīvu

(||īda||)
tamagamu rem̐gidenu tāne pĕṁḍlāḍīm̐ gāni
amara nādani gora naṁṭave nīvu
samaradi śhrīveṁṭeśhvarum̐ ḍidĕ ninnum̐ gūḍĕ
samugāna sem̐talu pasāriṁchave nīvu