ఈతఁడువో రాముఁడు యేకాంగవీరుఁడు
(॥పల్లవి॥)
ఈతఁడువో రాముఁడు యేకాంగవీరుఁడు
యేతలఁ జూచినఁ దానే(నై?) యిరవుకొన్నవాఁడు
(॥ఈతఁ॥)
చిఱుతపాయమునాఁడు శివునివిల్లు విఱిచి
మెఱసి సీతఁ బెండ్లాడి మించినవాఁడు
తఱిఁ బదునాలుగువేలదానవుల నిమిషాన
జఱసి తానొకఁడే చదిపినవాఁడు
(॥ఈతఁ॥)
వోడక విల్లెక్కువెట్టి వూరకె వొక్కమ్మునను
యేడుదాళ్ళు ధరఁగూల నేసినవాఁడు
జూడగాఁ గొండలచేత జలనిధి గట్టించి
వేడుకతో లంకమీఁద విడిసినవాఁడు
(॥ఈతఁ॥)
రావణ కుంభకర్ణాది రాకాసుల బరిమార్చి
యీవల నయోధ్యపట్న మోలినవాఁడు
శ్రీవేంకటాద్రిమీఁదఁ జేరి మాల్యవంతమున
వేవేలు చందములను వెలసినవాఁడు
(||pallavi||)
īdam̐ḍuvo rāmum̐ḍu yegāṁgavīrum̐ḍu
yedalam̐ jūsinam̐ dāne(nai?) yiravugŏnnavām̐ḍu
(||īdam̐||)
siṟudabāyamunām̐ḍu śhivunivillu viṟisi
mĕṟasi sīdam̐ bĕṁḍlāḍi miṁchinavām̐ḍu
taṟim̐ badunāluguveladānavula nimiṣhāna
jaṟasi tānŏgam̐ḍe sadibinavām̐ḍu
(||īdam̐||)
voḍaga villĕkkuvĕṭṭi vūragĕ vŏkkammunanu
yeḍudāḽḽu dharam̐gūla nesinavām̐ḍu
jūḍagām̐ gŏṁḍalaseda jalanidhi gaṭṭiṁchi
veḍugado laṁkamīm̐da viḍisinavām̐ḍu
(||īdam̐||)
rāvaṇa kuṁbhagarṇādi rāgāsula barimārsi
yīvala nayodhyabaṭna molinavām̐ḍu
śhrīveṁkaḍādrimīm̐dam̐ jeri mālyavaṁtamuna
vevelu saṁdamulanu vĕlasinavām̐ḍu