ఈతఁడు చలమరౌత యెఱఁగవా తొల్లి నీవు
(॥పల్లవి॥)
ఈతఁడు చలమరౌత యెఱఁగవా తొల్లి నీవు
చేతులెత్తి మొక్కి ఇట్టె సేవసేయరాదా
(॥॥)
తడఁబడువిభుఁడు తనపై నానవెట్టి
వొడివట్టి తియ్యఁగాను వోపనందురా
జడిసి వొడ్డాణము జారెఁ గుచ్చల వీడె
కడఁగీతనిదుప్పటి గప్పుకొనరాదా
(॥॥)
రాఁపుల నింటికి వచ్చి రమణుఁడు నీతోను
కాఁపురము సేయఁగాను కాదందురా
పైపైఁ గొప్పు వదలె భావము నివ్వెర గందె
తీపులమోవి యెసగి తెరవెయ్యరాదా
(॥॥)
యెన్నిక శ్రీ వేంకటేశుఁ డేకతాన నిన్నుఁ దీసి
చన్నులంటి కూడఁగాను చాలునందురా
కన్నులఁ దేటలుమించెఁ గళలు మోమున నిండె
అన్నువ గోర నూఁది యాదరించరాదా
(||pallavi||)
īdam̐ḍu salamarauda yĕṟam̐gavā tŏlli nīvu
sedulĕtti mŏkki iṭṭĕ sevaseyarādā
(||||)
taḍam̐baḍuvibhum̐ḍu tanabai nānavĕṭṭi
vŏḍivaṭṭi tiyyam̐gānu vobanaṁdurā
jaḍisi vŏḍḍāṇamu jārĕm̐ guchchala vīḍĕ
kaḍam̐gīdaniduppaḍi gappugŏnarādā
(||||)
rām̐pula niṁṭigi vachchi ramaṇum̐ḍu nīdonu
kām̐puramu seyam̐gānu kādaṁdurā
paibaim̐ gŏppu vadalĕ bhāvamu nivvĕra gaṁdĕ
tībulamovi yĕsagi tĕravĕyyarādā
(||||)
yĕnniga śhrī veṁkaḍeśhum̐ ḍegadāna ninnum̐ dīsi
sannulaṁṭi kūḍam̐gānu sālunaṁdurā
kannulam̐ deḍalumiṁchĕm̐ gaḽalu momuna niṁḍĕ
annuva gora nūm̐di yādariṁcharādā