Eedamdu pamtamu neegu nichcheemgaani

ఈతఁడు పంతము నీకు నిచ్చీఁగాని
Language

(॥పల్లవి॥)
ఈతఁడు పంతము నీకు నిచ్చీఁగాని
యీతల నాతోనైన నెచ్చరించరాదా

(॥॥)
హత్తుకువుండియు నీకు నలుక లంతేసి యేల
చిత్తములోపలిమాట చెప్పరాదా
బత్తిగలదానవు పట్టినమోనములేల
తత్తిరించక కలట్టె తారుకాణించరాదా

(॥॥)
పూఁతసిగ్గుతో నగవు పొదిగిపట్ట నేఁటికి
చేఁతలెల్లా వెల్లవిరి సేయరాదా
పూఁతచెక్కుచేతులతో నుమ్మగిల నేమిటికి
పాఁతసుద్దులెల్లా బట్టబాయిట వేయరాదా

(॥॥)
వుదుటుబీరముతోడ నోరచూపు లేమిటికి
పదరి మేగురుతు చూపఁగరాదా
యెదుట శ్రీవేంకటేశ యెనసితి రిద్దరును
ముదముతో నన్నీటికి మొక్కఁగరాదా

(||pallavi||)
īdam̐ḍu paṁtamu nīgu nichchīm̐gāni
yīdala nādonaina nĕchchariṁcharādā

(||||)
hattuguvuṁḍiyu nīgu naluga laṁtesi yela
sittamulobalimāḍa sĕpparādā
battigaladānavu paṭṭinamonamulela
tattiriṁchaga kalaṭṭĕ tārugāṇiṁcharādā

(||||)
pūm̐tasiggudo nagavu pŏdigibaṭṭa nem̐ṭigi
sem̐talĕllā vĕllaviri seyarādā
pūm̐tasĕkkusedulado nummagila nemiḍigi
pām̐tasuddulĕllā baṭṭabāyiḍa veyarādā

(||||)
vuduḍubīramudoḍa norasūbu lemiḍigi
padari megurudu sūbam̐garādā
yĕduḍa śhrīveṁkaḍeśha yĕnasidi riddarunu
mudamudo nannīḍigi mŏkkam̐garādā