ఈతఁడు నీకె మోహించు నిందరిలోన
(॥పల్లవి॥)
ఈతఁడు నీకె మోహించు నిందరిలోన
యీతల నీ రాజసము యేమని చెప్పుదుమే
(॥ఈత॥)
చెంతల నాతఁడు నీకు చెప్పినట్టెల్లాఁ జేసె
మంతనానఁ జన విచ్చి మాడ లాడెను
యెంతభాగ్యమో నీది యేమేమి నోమితివో
వింతసతులందు నిట్టి వేడుకలు గంటిమా
(॥ఈత॥)
తొడిఁ బడ నీవు రాఁగా తొడప ని న్నిడుకొనె
మెఁడ బెట్టీ సొమ్ములెల్లా మెచ్చి నీకును
వొడఁబాటు లేరీతివో వుదయఫల మెట్టిదో
కడఁగి యీ మహిమ యెక్కడనైనా నాఁగలదా
(॥ఈత॥)
ముచ్చట దీరఁగ నీమోము చూచి నవ్వు నవ్వె
పచ్చిదేరఁ గాఁగిలించి పైకొని కూడె
నిచ్చ శ్రీవేంకటేశుడు నిన్నురాన నుంచుకొనె
తచ్చి యీసరము లితరులకుఁ జెల్లువా
(||pallavi||)
īdam̐ḍu nīgĕ mohiṁchu niṁdarilona
yīdala nī rājasamu yemani sĕppudume
(||īda||)
sĕṁtala nādam̐ḍu nīgu sĕppinaṭṭĕllām̐ jesĕ
maṁtanānam̐ jana vichchi māḍa lāḍĕnu
yĕṁtabhāgyamo nīdi yememi nomidivo
viṁtasadulaṁdu niṭṭi veḍugalu gaṁṭimā
(||īda||)
tŏḍim̐ baḍa nīvu rām̐gā tŏḍaba ni nniḍugŏnĕ
mĕm̐ḍa bĕṭṭī sŏmmulĕllā mĕchchi nīgunu
vŏḍam̐bāḍu lerīdivo vudayaphala mĕṭṭido
kaḍam̐gi yī mahima yĕkkaḍanainā nām̐galadā
(||īda||)
muchchaḍa dīram̐ga nīmomu sūsi navvu navvĕ
pachchideram̐ gām̐giliṁchi paigŏni kūḍĕ
nichcha śhrīveṁkaḍeśhuḍu ninnurāna nuṁchugŏnĕ
tachchi yīsaramu lidarulagum̐ jĕlluvā