Eedamdu nee vasamaaya nimka nennamdu

ఈతఁడు నీ వసమాయ నిఁక నెన్నఁడు
Language

(॥పల్లవి॥)
ఈతఁడు నీ వసమాయ నిఁక నెన్నఁడు
చేతులార వూడిగాలు సేయవమ్మ ఇపుడు

(॥ఈత॥)
నిన్నే చూచీ నాఁతడు నీమొకమై యున్నవాఁడు
విన్నపాలు సేయవమ్మ విభునితోను
నున్ననిమాఁట లాడఁగ నొసలెల్లఁ జెమరించె
తిన్ననికస్తూరిబొట్టు తిద్దవమ్మా దగ్గరి

(॥ఈత॥)
పూనిపట్టి నవ్వునవ్వి బుజముపైఁ జేయివేసె
కానిక లియ్యవమ్మా కాంతునికిని
ఆనుక చన్ను లొత్తఁగా నంగమెల్లాఁ జెమరించె
మేనిపైఁ గప్పఁగరాదా మెఱఁగునీపయ్యద

(॥ఈత॥)
గక్కున విడెమువెట్టి కాఁగిట నిన్నుఁ గూడె
యెక్కవమ్మా శ్రీవేంకటేశువురము
మొక్కులు నీవు మొక్కగా ముంచేను నిట్టూర్పులేల్లా
తొక్కవమ్మా పాదమున తోడుతనే పెండ్లి

(||pallavi||)
īdam̐ḍu nī vasamāya nim̐ka nĕnnam̐ḍu
sedulāra vūḍigālu seyavamma ibuḍu

(||īda||)
ninne sūsī nām̐taḍu nīmŏgamai yunnavām̐ḍu
vinnabālu seyavamma vibhunidonu
nunnanimām̐ṭa lāḍam̐ga nŏsalĕllam̐ jĕmariṁchĕ
tinnanigastūribŏṭṭu tiddavammā daggari

(||īda||)
pūnibaṭṭi navvunavvi bujamubaim̐ jeyivesĕ
kāniga liyyavammā kāṁtunigini
ānuga sannu lŏttam̐gā naṁgamĕllām̐ jĕmariṁchĕ
menibaim̐ gappam̐garādā mĕṟam̐gunībayyada

(||īda||)
gakkuna viḍĕmuvĕṭṭi kām̐giḍa ninnum̐ gūḍĕ
yĕkkavammā śhrīveṁkaḍeśhuvuramu
mŏkkulu nīvu mŏkkagā muṁchenu niṭṭūrbulellā
tŏkkavammā pādamuna toḍudane pĕṁḍli