ఈతఁడు గుట్టుమానిసి యీతఁడు గంభీరుడు
(॥పల్లవి॥)
ఈతఁడు గుట్టుమానిసి యీతఁడు గంభీరుడు
కాఁతరీఁడు గాఁడు యేల కాఁకలు సేసేవే
(॥॥)
చెక్కు చేతఁబెట్టుకొని సెలవుల నవ్వుకొంటా
మక్కువ నీతనితోడ మాటలాడేవు
జక్కవచన్నుల మీఁది చంద్రకావి పయ్యద
పక్కన జారించి యెంత భ్రమలఁబెట్టేవే
(॥॥)
తలిరుమోవి చూపి తములము సేసుకొంటా
పలుమారు నీతనిఁ దప్పకచూచేవు
చెలులమాఁటుననుండి సిగ్గులు నెరపుకొంటా
వలపులు చల్లి యెంత వలలఁ బెట్టేవే
(॥॥)
చిమ్ముఁ జెమటలతోడ సేసకొప్పు గదలఁగ
కమ్ముక శ్రీవేంకటేశుఁ గాఁగిలించేవు
పమ్మి నన్నుఁ గూడినాఁడు బయలుసింగారాల
యెమ్మెలు సేసి యెలఇంచేవే
(||pallavi||)
īdam̐ḍu guṭṭumānisi yīdam̐ḍu gaṁbhīruḍu
kām̐tarīm̐ḍu gām̐ḍu yela kām̐kalu seseve
(||||)
sĕkku sedam̐bĕṭṭugŏni sĕlavula navvugŏṁṭā
makkuva nīdanidoḍa māḍalāḍevu
jakkavasannula mīm̐di saṁdragāvi payyada
pakkana jāriṁchi yĕṁta bhramalam̐bĕṭṭeve
(||||)
talirumovi sūbi tamulamu sesugŏṁṭā
palumāru nīdanim̐ dappagasūsevu
sĕlulamām̐ṭunanuṁḍi siggulu nĕrabugŏṁṭā
valabulu salli yĕṁta valalam̐ bĕṭṭeve
(||||)
simmum̐ jĕmaḍaladoḍa sesagŏppu gadalam̐ga
kammuga śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchevu
pammi nannum̐ gūḍinām̐ḍu bayalusiṁgārāla
yĕmmĕlu sesi yĕla̮iṁcheve