ఈతఁడొక్కఁడే యన్నిటా నెన్నిక కెక్కినవాఁడు
(॥పల్లవి॥)
ఈతఁడొక్కఁడే యన్నిటా నెన్నిక కెక్కినవాఁడు
చూతమురారో చక్కని రీతి గలవాఁడు
(॥ఈతఁ॥)
సారెకుఁ బుటమెగరి సాముచేసినవాఁడు
ఆరితేరిన చిప్పలహరికెవాఁడు
పోరి కొమ్ముదారతోడి పోటుబంటయినవాఁడు
చేరి రివులఁ జెండాడే చేకత్తులవాఁడు
(॥ఈతఁ॥)
పొంచి యడుగడుగుకుఁ బొదలేవాఁడు
చెంచలించక పగలు సాదించేవాఁడు
పెంచి శరణంటేఁ గాచే బిరుదువాఁడు
మించి యెలువఁగరాని మేటి బలువాఁడు
(॥ఈతఁ॥)
పరులనుఁ గడు సిగ్గు వరపించేవాఁడు
తొరలి తొక్కని చోట్లు దొక్కేటివాఁడు
సురలకు నేలికై సూడువట్టేవాఁడు
నిరతి శ్రీవేంకటాద్రి నెలకొన్నవాఁడు
(||pallavi||)
īdam̐ḍŏkkam̐ḍe yanniḍā nĕnniga kĕkkinavām̐ḍu
sūdamurāro sakkani rīdi galavām̐ḍu
(||īdam̐||)
sārĕgum̐ buḍamĕgari sāmusesinavām̐ḍu
āriderina sippalaharigĕvām̐ḍu
pori kŏmmudāradoḍi poḍubaṁṭayinavām̐ḍu
seri rivulam̐ jĕṁḍāḍe segattulavām̐ḍu
(||īdam̐||)
pŏṁchi yaḍugaḍugugum̐ bŏdalevām̐ḍu
sĕṁchaliṁchaga pagalu sādiṁchevām̐ḍu
pĕṁchi śharaṇaṁṭem̐ gāse biruduvām̐ḍu
miṁchi yĕluvam̐garāni meḍi baluvām̐ḍu
(||īdam̐||)
parulanum̐ gaḍu siggu varabiṁchevām̐ḍu
tŏrali tŏkkani soṭlu dŏkkeḍivām̐ḍu
suralagu neligai sūḍuvaṭṭevām̐ḍu
niradi śhrīveṁkaḍādri nĕlagŏnnavām̐ḍu