Eedam dimdaamkaa raamdamtaa nedurulu soosidivi

ఈతఁ డిందాఁకా రాఁడఁటా నెదురులు చూచితివి
Language

(॥పల్లవి॥)
ఈతఁ డిందాఁకా రాఁడఁటా నెదురులు చూచితివి
యేతులకు నిప్పుడేల యెగసక్కేలాడేవే

(॥ఈతఁ॥)
పిలువఁగా బతిలోను పెనఁగేవు సారెకు నీ
బలిమెంత గలదేపడఁతీ
చెల రేఁగి నిన్నుఁ గూడఁగా శిరసు వంచుకొనేవు
చల మెందాఁకానే నీకు సకియా

(॥ఈతఁ॥)
మంతనాన నిన్న తఁడు మర్మములు ముట్టఁగాను
పంతము లాడుదురటే భామినీ
సంతసాన నీమగఁడు సరసములాడఁగాను
చింతించ నింకానేలే చెలియా

(॥ఈతఁ॥)
కూడఁగా శ్రీవేంకటేశుఁ గొసరే వప్పటి నీకు
వేడు కెంత గలదే వెలదీ
జోడు గూడి వుండఁగానే సొలసి తమకించేవు
సూడు వెదకఁగ నేలే సుదతీ

(||pallavi||)
īdam̐ ḍiṁdām̐kā rām̐ḍam̐ṭā nĕdurulu sūsidivi
yedulagu nippuḍela yĕgasakkelāḍeve

(||īdam̐||)
piluvam̐gā badilonu pĕnam̐gevu sārĕgu nī
balimĕṁta galadebaḍam̐tī
sĕla rem̐gi ninnum̐ gūḍam̐gā śhirasu vaṁchugŏnevu
sala mĕṁdām̐kāne nīgu sagiyā

(||īdam̐||)
maṁtanāna ninna tam̐ḍu marmamulu muṭṭam̐gānu
paṁtamu lāḍuduraḍe bhāminī
saṁtasāna nīmagam̐ḍu sarasamulāḍam̐gānu
siṁtiṁcha niṁkānele sĕliyā

(||īdam̐||)
kūḍam̐gā śhrīveṁkaḍeśhum̐ gŏsare vappaḍi nīgu
veḍu kĕṁta galade vĕladī
joḍu gūḍi vuṁḍam̐gāne sŏlasi tamagiṁchevu
sūḍu vĕdagam̐ga nele sudadī