E(e)daleni tagavulu nemta pemchevu

ఏ(ఎ)డలేని తగవులు నెంత పెంచేవు
Language

(॥పల్లవి॥)
ఏ(ఎ)డలేని తగవులు నెంత పెంచేవు
వీ(వి)డెమియ్యఁగా నీతో వేసరీనా చెలియ

(॥ఏడ॥)
ఆకె నీవు నేకతాన నాడుకొన్నమాటలు
యీకడఁ దారుకాణీంచ నెట్టువచ్చును
దాకొని యిచ్చనబాస తప్పని దొక్కటేకాక
కాకు సేసేనంటే నిన్నుఁ గాదనీనా చెలియ

(॥ఏడ॥)
రతిలోన మీలోన రహస్యపుచెనకులు
యితరు లెరిఁగి చూప నెట్టువచ్చును
మతిలో దయదలఁచి మన్నించే దొక్కటే కాక
తతి సిగ్గువరచితే దండించీనా చెలియ

(॥ఏడ॥)
అలమేల్‌మంగకు నీకు నాసలు శ్రీ వెంకటేశ
యెలమి లెక్కించి చెప్ప నెట్టువచ్చును
వెలయ నీవు గూడిన వేడుక వొక్కటే కాక
వల పారడిఁ బెట్టితే వద్దనీనా చెలియ

(||pallavi||)
e(ĕ)ḍaleni tagavulu nĕṁta pĕṁchevu
vī(vi)ḍĕmiyyam̐gā nīdo vesarīnā sĕliya

(||eḍa||)
āgĕ nīvu negadāna nāḍugŏnnamāḍalu
yīgaḍam̐ dārugāṇīṁcha nĕṭṭuvachchunu
dāgŏni yichchanabāsa tappani dŏkkaḍegāga
kāgu sesenaṁṭe ninnum̐ gādanīnā sĕliya

(||eḍa||)
radilona mīlona rahasyabusĕnagulu
yidaru lĕrim̐gi sūba nĕṭṭuvachchunu
madilo dayadalam̐si manniṁche dŏkkaḍe kāga
tadi sigguvaraside daṁḍiṁchīnā sĕliya

(||eḍa||)
alamel‌maṁgagu nīgu nāsalu śhrī vĕṁkaḍeśha
yĕlami lĕkkiṁchi sĕppa nĕṭṭuvachchunu
vĕlaya nīvu gūḍina veḍuga vŏkkaḍe kāga
vala pāraḍim̐ bĕṭṭide vaddanīnā sĕliya