Eedaa nimtu lunnaaru yevvarai remi tanagu

ఈడా నింతు లున్నారు యెవ్వరై రేమి తనకు
Language

(॥పల్లవి॥)
ఈడా నింతు లున్నారు యెవ్వరై రేమి తనకు
ఆడరే యీమాట నే నంటినని చెలులు

(॥ఈడా॥)
అప్పటినుండీఁ గొలువై వున్నాఁడు రమణుఁడు
అప్పసమై కాంతలెల్లా నండ నుండఁగా
కప్పి బోనగత్తె లెల్లాఁ గాచుకున్నా రిక్కడ
చెప్పరే యాఁకలిగొనే చెలులాల పతికి

(॥ఈడా॥)
యెంత వొద్దా తాఁ జూడఁడు యేకతము లాడీఁదాను
జంత సతులెల్లా సరసము లాడఁగా
కాంతలేల్లా నిట్టే జలకము వట్టుకున్నారు
చెంతల నెచ్చరిమచరే చెలులాల పతికి

(॥ఈడా॥)
వొక్కి చొక్కి తా నిట్టే చూచీ నాటకసాలలు
యెక్కడలేని జవ్వను లెలయించఁగా
యిక్కడ నన్నేలినాఁడు యింకా దేవుళ్లున్న వారు
చిక్కించుక చూపురే శ్రీవేంకటపతికి

(||pallavi||)
īḍā niṁtu lunnāru yĕvvarai remi tanagu
āḍare yīmāḍa ne naṁṭinani sĕlulu

(||īḍā||)
appaḍinuṁḍīm̐ gŏluvai vunnām̐ḍu ramaṇum̐ḍu
appasamai kāṁtalĕllā naṁḍa nuṁḍam̐gā
kappi bonagattĕ lĕllām̐ gāsugunnā rikkaḍa
sĕppare yām̐kaligŏne sĕlulāla padigi

(||īḍā||)
yĕṁta vŏddā tām̐ jūḍam̐ḍu yegadamu lāḍīm̐dānu
jaṁta sadulĕllā sarasamu lāḍam̐gā
kāṁtalellā niṭṭe jalagamu vaṭṭugunnāru
sĕṁtala nĕchcharimasare sĕlulāla padigi

(||īḍā||)
vŏkki sŏkki tā niṭṭe sūsī nāḍagasālalu
yĕkkaḍaleni javvanu lĕlayiṁcham̐gā
yikkaḍa nannelinām̐ḍu yiṁkā devuḽlunna vāru
sikkiṁchuga sūbure śhrīveṁkaḍabadigi