ఈడ నెవ్వరి సొలసే వింత సలిగె గలితే
(॥పల్లవి॥)
ఈడ నెవ్వరి సొలసే వింత సలిగె గలితే
వాడికె నాతనిచేత వలపించుకోవే
(॥ఈడ॥)
సారె నీవు నాతో జగడించినందుకెల్లా
చేరి ప్రియా లతనిచేఁ జెప్పించుకోవే
దూరి నేఁ గోపాన నిన్ను దొబ్బినందు కిపుడే
యీరానిపంతాలు నందే ఇప్పించుకోవే
(॥ఈడ॥)
సేయరాని సేఁత నిన్నుఁ జేసినందు కెల్లాను
మోయనాడి నాతనిచే మొక్కించుకోవే
వోయమ్య నిన్ను నే వొట్టువెట్టినందుకట్టె
వేయిమారు లతనిచే వెస మొక్కించుకోవే
(॥ఈడ॥)
సవతిమచ్చరాన నే సడిఁబెట్టినందుకేల్లా
రవళి నీయింటికే రప్పించుకోవే
యివల శ్రీవేంకటేశుఁ డీడ నిట్టె నన్నుఁ గూడి
కవ వాయకున్నాఁడు కరఁగించుకోవే
(||pallavi||)
īḍa nĕvvari sŏlase viṁta saligĕ galide
vāḍigĕ nādaniseda valabiṁchugove
(||īḍa||)
sārĕ nīvu nādo jagaḍiṁchinaṁdugĕllā
seri priyā ladanisem̐ jĕppiṁchugove
dūri nem̐ gobāna ninnu dŏbbinaṁdu kibuḍe
yīrānibaṁtālu naṁde ippiṁchugove
(||īḍa||)
seyarāni sem̐ta ninnum̐ jesinaṁdu kĕllānu
moyanāḍi nādanise mŏkkiṁchugove
voyamya ninnu ne vŏṭṭuvĕṭṭinaṁdugaṭṭĕ
veyimāru ladanise vĕsa mŏkkiṁchugove
(||īḍa||)
savadimachcharāna ne saḍim̐bĕṭṭinaṁdugellā
ravaḽi nīyiṁṭige rappiṁchugove
yivala śhrīveṁkaḍeśhum̐ ḍīḍa niṭṭĕ nannum̐ gūḍi
kava vāyagunnām̐ḍu karam̐giṁchugove