Eeda maado nimtayela yegasakkelu

ఈడ మాతో నింతయేల యెగసక్కేలు
Language

(॥పల్లవి॥)
ఈడ మాతో నింతయేల యెగసక్కేలు
వేడుకకాఁడవు నీవు వేసాలు మానరా

(॥ఈడ॥)
వద్దన్న మానవు యేరా వాదులకే వచ్చేవు
కొద్దిమాలి నిన్నుఁ బేరుకొంటిమా నేము
పెద్దరికాలకు నీతోఁ బెనఁగేటివారితోనే
చద్దికి వేఁడికి నీవు సరసము లాడరా

(॥ఈడ॥)
చాలునన్న మానవేరా జాణతనా లాడేవు
కేలుచాఁచి నిన్నుఁ జెనకితినా నేను
నాలితనమున నీతో నవ్వేటివారితోనే
కోలుముందుగా వారికూటములే సేయరా

(॥ఈడ॥)
వోపనన్న మానవేరా వుద్దండానఁ గూడితివి
కోపగించవలెనని కొసరితివా
యేపున శ్రీవేంకటేశ యేడవారినైనా వట్టి-
చూపులు చూచితి విఁక సుద్దులవి మానరా

(||pallavi||)
īḍa mādo niṁtayela yĕgasakkelu
veḍugagām̐ḍavu nīvu vesālu mānarā

(||īḍa||)
vaddanna mānavu yerā vādulage vachchevu
kŏddimāli ninnum̐ berugŏṁṭimā nemu
pĕddarigālagu nīdom̐ bĕnam̐geḍivāridone
saddigi vem̐ḍigi nīvu sarasamu lāḍarā

(||īḍa||)
sālunanna mānaverā jāṇadanā lāḍevu
kelusām̐si ninnum̐ jĕnagidinā nenu
nālidanamuna nīdo navveḍivāridone
kolumuṁdugā vārigūḍamule seyarā

(||īḍa||)
vobananna mānaverā vuddaṁḍānam̐ gūḍidivi
kobagiṁchavalĕnani kŏsaridivā
yebuna śhrīveṁkaḍeśha yeḍavārinainā vaṭṭi-
sūbulu sūsidi vim̐ka suddulavi mānarā