Eebegu nidamdu dagu nidani keebe dagu

ఈపెకు నితఁడు దగు నితని కీపె దగు
Language

(॥పల్లవి॥)
ఈపెకు నితఁడు దగు నితని కీపె దగు
చూపూలకు పండుగాయ శోభనము నేఁడు

(॥ఈపెకు॥)
పిలువరె పెండ్లి కూతురు బెండ్లి పీఁట మీదికి
చెలఁగి తా నెదురు చూచీ దేవుఁడు
బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె
కలిమెల్ల మెరసి సింగారించరే

(॥ఈపెకు॥)
ఆతలఁ దెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూఁతురును
యీతఁడే జంట శోభన మిద్దరికిని
కాతరాన బువ్వా నకు గక్కనఁ బెట్టరె మీరు
రేతిటనుండియు వేగిరించేరు వీరు

(॥ఈపెకు॥)
పానుపు వరచరె బలునాగవల్లి నేడు
పూని తెరవేయరె సొలఁతులాల
ఆనుక శ్రీవేంకటేశుడలమేలు మంగయును
లోననె భూకాంతయును లోలులైరి తాము

(||pallavi||)
ībĕgu nidam̐ḍu dagu nidani kībĕ dagu
sūbūlagu paṁḍugāya śhobhanamu nem̐ḍu

(||ībĕgu||)
piluvarĕ pĕṁḍli kūduru bĕṁḍli pīm̐ṭa mīdigi
sĕlam̐gi tā nĕduru sūsī devum̐ḍu
baluvugā niddarigi bāsigamulu gaṭṭarĕ
kalimĕlla mĕrasi siṁgāriṁchare

(||ībĕgu||)
ādalam̐ dĕchchi pĕṭṭarĕ ā pĕṁḍli kūm̐turunu
yīdam̐ḍe jaṁṭa śhobhana middarigini
kādarāna buvvā nagu gakkanam̐ bĕṭṭarĕ mīru
rediḍanuṁḍiyu vegiriṁcheru vīru

(||ībĕgu||)
pānubu varasarĕ balunāgavalli neḍu
pūni tĕraveyarĕ sŏlam̐tulāla
ānuga śhrīveṁkaḍeśhuḍalamelu maṁgayunu
lonanĕ bhūgāṁtayunu lolulairi tāmu