ఈపెతోడి సాటికి నీ వేల పెనఁగేవు నేఁడు
(॥పల్లవి॥)
ఈపెతోడి సాటికి నీ వేల పెనఁగేవు నేఁడు
మోపుదాఁకా గాజు గాజే మాణికెము వేరే
(॥ఈప॥)
ఆఁటది గోపగించితే అంతా నంత వలుపే
తేటలు మగవానిని తేలిపొయ్యేవే
మేటి కస్తూరి నూరితే మిక్కిలిఁ బరిమళించు
గాటానఁబువ్వులు పిసుకఁగఁ బసురయ్యేదే
(॥ఈప॥)
అంగనలు దిట్టితేను ఆయములు గరఁగేవే
కంగి మగవానితిట్టు గాలిఁ బొయ్యేదే
బంగారు గరఁగితేను పైపై వన్నె యెక్కేదే
వంగుచు నిత్తడి కాఁక నన్నె దీసేదే
(॥ఈప॥)
మగువ లలిగితేను మచ్చికల కెక్కేవే
మగవానియలుక కమ్మటి లోఁగేదే
జిగి నలమేల్మంగను శ్రీ వేంకటేశ కూడితి
తగినవెన్నెలయుఁ జందమామయు నొకటే
(||pallavi||)
ībĕdoḍi sāḍigi nī vela pĕnam̐gevu nem̐ḍu
mobudām̐kā gāju gāje māṇigĕmu vere
(||ība||)
ām̐ṭadi gobagiṁchide aṁtā naṁta valube
teḍalu magavānini telibŏyyeve
meḍi kastūri nūride mikkilim̐ barimaḽiṁchu
gāḍānam̐buvvulu pisugam̐gam̐ basurayyede
(||ība||)
aṁganalu diṭṭidenu āyamulu garam̐geve
kaṁgi magavānidiṭṭu gālim̐ bŏyyede
baṁgāru garam̐gidenu paibai vannĕ yĕkkede
vaṁgusu nittaḍi kām̐ka nannĕ dīsede
(||ība||)
maguva laligidenu machchigala kĕkkeve
magavāniyaluga kammaḍi lom̐gede
jigi nalamelmaṁganu śhrī veṁkaḍeśha kūḍidi
taginavĕnnĕlayum̐ jaṁdamāmayu nŏgaḍe