ఈపాటివాఁడవు యెట్టు పొందుసేసితివి
(॥పల్లవి॥)
ఈపాటివాఁడవు యెట్టు పొందుసేసితివి
వోపికగలవారికి వొదుగనేలా
(॥ఈపా॥)
పిలిచీఁగదయ్య నిన్నుఁబ్రియురాలు
చెలఁగి యేల పరాకుసేసుకొనేవు
చెలులము మేము వింటే సిగ్గయ్యీనా
బలవంతులకు మరి భయమున్నదా
(॥ఈపా॥)
బాగాలిచ్చీ నీప్రాణబందుగురాలు
చేవ(గ?) దేర నీవెల చేయొగ్గవు
నీగుణాలు చూచి నేమునేరమెంచేమా
వేగిరపువారి కింత విచారించనున్నదా
(॥ఈపా॥)
యెనసీఁగదవయ్య నీయిచ్చుకురాలు
మనసిచ్చి నీవేల మాఁటలాడవు
అనుఁగు శ్రీవేంకటేశ అలమేలుమంగ యాపె
ఘనులైనవారికికడుఁగొంక నున్నదా
(||pallavi||)
ībāḍivām̐ḍavu yĕṭṭu pŏṁdusesidivi
vobigagalavārigi vŏduganelā
(||ībā||)
pilisīm̐gadayya ninnum̐briyurālu
sĕlam̐gi yela parāgusesugŏnevu
sĕlulamu memu viṁṭe siggayyīnā
balavaṁtulagu mari bhayamunnadā
(||ībā||)
bāgālichchī nīprāṇabaṁdugurālu
seva(ga?) dera nīvĕla seyŏggavu
nīguṇālu sūsi nemuneramĕṁchemā
vegirabuvāri kiṁta visāriṁchanunnadā
(||ībā||)
yĕnasīm̐gadavayya nīyichchugurālu
manasichchi nīvela mām̐ṭalāḍavu
anum̐gu śhrīveṁkaḍeśha alamelumaṁga yābĕ
ghanulainavārigigaḍum̐gŏṁka nunnadā