Eebaadivaamdavu yela kobagimchidivi

ఈపాటివాఁడవు యేల కోపగించితివి
Language

(॥పల్లవి॥)
ఈపాటివాఁడవు యేల కోపగించితివి
చేపట్టినటులానె సేయ రాదా

(॥ఈపాటి॥)
చెక్కు నొక్కకుర నీవు చేయి చాఁచకుర నాపై
చక్క నీ మంచితనాలు చాలుఁ జాలు
పక్కనఁ గోపించ వద్దు పైకొని వేఁడుకో వద్దు
వొక్కమారె యింతేసికి నోపను నేను

(॥ఈ పాటి॥)
కాలు దొక్కకుర నీవు కమ్మటి నవ్వకు నాతో
జాలినీ యిచ్చకములు చాలుఁ జాలు
తాలిమిఁ దిట్టా వద్దు దగ్గరి మొక్కా వద్దు
మేలు మీఁదనె వుండే మేరతో నడవరా

(॥ఈపాటి॥)
మాటలాడకుర నీవు మాయలు సేయకురా
చాటు వాయ నీవలపు చాలుఁ జాలు
గాఁటపు శ్రీవెంకటేశ కరఁగించి కూడితివి
మేటి నీ గుణములకు మెచ్చితి నే నిదివో

(||pallavi||)
ībāḍivām̐ḍavu yela kobagiṁchidivi
sebaṭṭinaḍulānĕ seya rādā

(||ībāḍi||)
sĕkku nŏkkagura nīvu seyi sām̐sagura nābai
sakka nī maṁchidanālu sālum̐ jālu
pakkanam̐ gobiṁcha vaddu paigŏni vem̐ḍugo vaddu
vŏkkamārĕ yiṁtesigi nobanu nenu

(||ī pāḍi||)
kālu dŏkkagura nīvu kammaḍi navvagu nādo
jālinī yichchagamulu sālum̐ jālu
tālimim̐ diṭṭā vaddu daggari mŏkkā vaddu
melu mīm̐danĕ vuṁḍe merado naḍavarā

(||ībāḍi||)
māḍalāḍagura nīvu māyalu seyagurā
sāḍu vāya nīvalabu sālum̐ jālu
gām̐ṭabu śhrīvĕṁkaḍeśha karam̐giṁchi kūḍidivi
meḍi nī guṇamulagu mĕchchidi ne nidivo