Eebaadivaamdavaa yissee neevu

ఈపాటివాఁడవా యిస్సీ నీవు
Language

(॥పల్లవి॥)
ఈపాటివాఁడవా యిస్సీ నీవు
యేపున నీ దీమసము యేడ నుండె నపుడూ

(॥ఈపాటి॥)
ఆయము సోఁకినమాట లాపె నీతో నాడఁగాను
కాయ మెల్లఁ గరఁగేవు కాక దేరఁగా
యీయెడ వద్ద నున్నవా రెవ్వ రవుతా నెరఁగవు
చేయి వట్టి తియ్యఁగానె సిగ్గు వడే విపుడు

(॥ఈపాటి॥)
చిప్పిల సెలవులను చెలి యట్టె నవ్వఁగాను
తప్పక చూచే వక్కడె దైవారుతా
చెప్పి చెప్పి నిన్ను గోరఁ జిదిమినా నెరఁగవు
కొప్పువట్టి తియ్యఁగా కొంకి లోఁగే విపుడు

(॥ఈపాటి॥)
చెక్కు నొక్కి సతి నీ సేవ లెల్లఁ జేయఁగాను
మిక్కిలి లోలుఁడ వైతి మేర మీరఁగా
కక్క సించి నేఁ గూడితె గక్కన శ్రీ వేంకటేశ
మొక్కుచు నాతో నింతలో ముచ్చటాడే విపుడు

(||pallavi||)
ībāḍivām̐ḍavā yissī nīvu
yebuna nī dīmasamu yeḍa nuṁḍĕ nabuḍū

(||ībāḍi||)
āyamu som̐kinamāḍa lābĕ nīdo nāḍam̐gānu
kāya mĕllam̐ garam̐gevu kāga deram̐gā
yīyĕḍa vadda nunnavā rĕvva ravudā nĕram̐gavu
seyi vaṭṭi tiyyam̐gānĕ siggu vaḍe vibuḍu

(||ībāḍi||)
sippila sĕlavulanu sĕli yaṭṭĕ navvam̐gānu
tappaga sūse vakkaḍĕ daivārudā
sĕppi sĕppi ninnu goram̐ jidiminā nĕram̐gavu
kŏppuvaṭṭi tiyyam̐gā kŏṁki lom̐ge vibuḍu

(||ībāḍi||)
sĕkku nŏkki sadi nī seva lĕllam̐ jeyam̐gānu
mikkili lolum̐ḍa vaidi mera mīram̐gā
kakka siṁchi nem̐ gūḍidĕ gakkana śhrī veṁkaḍeśha
mŏkkusu nādo niṁtalo muchchaḍāḍe vibuḍu