ఈపాటిది వలె నీకు నిన్నియునుఁ జెల్లఁబెట్ట
(॥పల్లవి॥)
ఈపాటిది వలె నీకు నిన్నియునుఁ జెల్లఁబెట్ట
దాఁపురము గల్గె నీకు తానెవ్వరోయీ
(॥ఈపా॥)
పొంకముగాఁదిట్టీ పొలఁతి; నీమాటలు
వంకలొత్తి పూనుకవచ్చీ నీకు
లంకెలై యడ్డాలు దూరీ లావుగా నిన్నాడుకొంటే
కొంకర యెందు గడించుకొంటివోయి యీకెను
(॥ఈపా॥)
బాసలు సేయఁగవచ్చీ పలుమారు నీకుఁగాను
వాసితోఁ బొగడీ నిన్ను వదివారితో
సేసినచేఁతలకుఁ జెప్పీఁ గతకారణాలు
నేసుక యెన్నాళ్లాయఁ జెప్పవోయి యీకెను
(॥ఈపా॥)
తప్పులుదీరుచవచ్చీ తక్కరినీనడకలు
తప్పక సాకిరిచెప్పీఁ దగుదునంటా
ఇప్పుడిట్టె శ్రీవేంకటేశ నన్ను నేలితివి
అప్పనము దాఁచుకొంటి వవునోయి యీకెను
(||pallavi||)
ībāḍidi valĕ nīgu ninniyunum̐ jĕllam̐bĕṭṭa
dām̐puramu galgĕ nīgu tānĕvvaroyī
(||ībā||)
pŏṁkamugām̐diṭṭī pŏlam̐ti; nīmāḍalu
vaṁkalŏtti pūnugavachchī nīgu
laṁkĕlai yaḍḍālu dūrī lāvugā ninnāḍugŏṁṭe
kŏṁkara yĕṁdu gaḍiṁchugŏṁṭivoyi yīgĕnu
(||ībā||)
bāsalu seyam̐gavachchī palumāru nīgum̐gānu
vāsidom̐ bŏgaḍī ninnu vadivārido
sesinasem̐talagum̐ jĕppīm̐ gadagāraṇālu
nesuga yĕnnāḽlāyam̐ jĕppavoyi yīgĕnu
(||ībā||)
tappuludīrusavachchī takkarinīnaḍagalu
tappaga sāgirisĕppīm̐ dagudunaṁṭā
ippuḍiṭṭĕ śhrīveṁkaḍeśha nannu nelidivi
appanamu dām̐sugŏṁṭi vavunoyi yīgĕnu