Eebaadi vubasaara midi saaladaa

ఈపాటి వుపచార మిది చాలదా
Language

(॥పల్లవి॥)
ఈపాటి వుపచార మిది చాలదా
చేపట్టి నే నిఁక నిన్నుఁ జేసేదేమీ

(॥ఈపా॥)
అందరితోనుఁ జెప్పక అట్టె మనపొందులెల్లా
అంది ఆకెతోఁ జెప్పితి వది చాలదా
చెంది యాఁటదాని కీసిగ్గులే సింగారములు
నిందలమగవాఁడవు నీ కేమయ్యా

(॥ఈపా॥)
అంగపు మేనిగురుతు లాపెకే చూపితిగాని
అంగడిఁ బెట్టవైతి వది చాలదా
ముంగిట నిల్లాలికి ముంచినసొమ్ముణఁకువ
చెంగట నీవు దొరవు చెప్పనేఁటికయ్యా

(॥ఈపా॥)
అంకెల మాతోసాటికి ఆకెనే యేలితి గాని
అంకిం చితరులనేల వది చాలదా
మంకులేని నేర్పరికి మానమే మూలధనము
యింక శ్రీ వేంకటేశ నన్నేలితివి మేలయ్యా

(||pallavi||)
ībāḍi vubasāra midi sāladā
sebaṭṭi ne nim̐ka ninnum̐ jesedemī

(||ībā||)
aṁdaridonum̐ jĕppaga aṭṭĕ manabŏṁdulĕllā
aṁdi āgĕdom̐ jĕppidi vadi sāladā
sĕṁdi yām̐ṭadāni kīsiggule siṁgāramulu
niṁdalamagavām̐ḍavu nī kemayyā

(||ībā||)
aṁgabu menigurudu lābĕge sūbidigāni
aṁgaḍim̐ bĕṭṭavaidi vadi sāladā
muṁgiḍa nillāligi muṁchinasŏmmuṇam̐kuva
sĕṁgaḍa nīvu dŏravu sĕppanem̐ṭigayyā

(||ībā||)
aṁkĕla mādosāḍigi āgĕne yelidi gāni
aṁkiṁ sidarulanela vadi sāladā
maṁkuleni nerbarigi māname mūladhanamu
yiṁka śhrī veṁkaḍeśha nannelidivi melayyā