ఈపాటి మా నేరుపు యెట్టువలసినాఁ జేయి
(॥పల్లవి॥)
ఈపాటి మా నేరుపు యెట్టువలసినాఁ జేయి
వోపినపాటి నే నొనగూడేఁ గాక
(॥ఈపా॥)
బిరుదుమగనితోడఁ బెనఁగఁగఁగలనా
గరిమ నే నొడ్డుకొనఁగలఁగాక
దొరవు చేతులఁబట్టి దొబ్బఁగలనా నేను
కెరలి కొనగోర దాఁకించఁగలఁగాక
(॥ఈపా॥)
చలపాదివానితోడ సరసమాడఁగలనా
కలసి మెలసి మొక్కఁగలఁగాక
పెలుచుఁదనపునీతో బిగియఁగలనా నేను
వొలిసినట్టు చన్నుల నొత్తఁగలఁగాక
(॥ఈపా॥)
శ్రీవేంకటేశ్వర నిన్నుఁ జేరి మీరఁగలనా
కావరించి సేవసేయఁగలఁగాక
యీవేళ నలమేలు మంగ నేను నన్నుఁ గూడితివి
చేవమీరఁగలనా చెందఁగలఁగాక
(||pallavi||)
ībāḍi mā nerubu yĕṭṭuvalasinām̐ jeyi
vobinabāḍi ne nŏnagūḍem̐ gāga
(||ībā||)
birudumaganidoḍam̐ bĕnam̐gam̐gam̐galanā
garima ne nŏḍḍugŏnam̐galam̐gāga
dŏravu sedulam̐baṭṭi dŏbbam̐galanā nenu
kĕrali kŏnagora dām̐kiṁcham̐galam̐gāga
(||ībā||)
salabādivānidoḍa sarasamāḍam̐galanā
kalasi mĕlasi mŏkkam̐galam̐gāga
pĕlusum̐danabunīdo bigiyam̐galanā nenu
vŏlisinaṭṭu sannula nŏttam̐galam̐gāga
(||ībā||)
śhrīveṁkaḍeśhvara ninnum̐ jeri mīram̐galanā
kāvariṁchi sevaseyam̐galam̐gāga
yīveḽa nalamelu maṁga nenu nannum̐ gūḍidivi
sevamīram̐galanā sĕṁdam̐galam̐gāga