Eebaadi keebaadi yimka nemto

ఈపాటి కీపాటి యిఁక నెంతో
Language

(॥పల్లవి॥)
ఈపాటి కీపాటి యిఁక నెంతో
కోపగించ రాదు నీతో కూటములు చెల్లునా

(॥ఈపాటి॥)
సెలవుల నవ్వితేనె చెరఁగు వట్టెవు నీవు
యెలమి నాల నైతే యెంత సేతువో
బలవులతోడి పొందు పై వచ్చునై వచ్చు
చలము సాదించ రాదు చాలు నోప నందుకు

(॥ఈపాటి॥)
మచ్చికె నిన్నుఁ జూచితే మంచానకుఁ దీసేవు
యిచ్చలు నీకుఁ జేసితే నెంత నేతువో
వచ్చెఁ బలివేలు మాకు వరుస లిందే కంటిమి
మచ్చరించ రాదు నాతో మాట లింతే సేఁటికి

(॥ఈపాటి॥)
వొంటి నే నిలుచుంటెనే వూరకే కాఁగిలించేవు
యింటికిఁ బిలచుకొంటే నెంత సేతువో
గొంట వై శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
దంట నై జంకిం రాదు తతి వచ్చె నీకును

(||pallavi||)
ībāḍi kībāḍi yim̐ka nĕṁto
kobagiṁcha rādu nīdo kūḍamulu sĕllunā

(||ībāḍi||)
sĕlavula navvidenĕ sĕram̐gu vaṭṭĕvu nīvu
yĕlami nāla naide yĕṁta seduvo
balavuladoḍi pŏṁdu pai vachchunai vachchu
salamu sādiṁcha rādu sālu noba naṁdugu

(||ībāḍi||)
machchigĕ ninnum̐ jūside maṁchānagum̐ dīsevu
yichchalu nīgum̐ jeside nĕṁta neduvo
vachchĕm̐ balivelu māgu varusa liṁde kaṁṭimi
machchariṁcha rādu nādo māḍa liṁte sem̐ṭigi

(||ībāḍi||)
vŏṁṭi ne nilusuṁṭĕne vūrage kām̐giliṁchevu
yiṁṭigim̐ bilasugŏṁṭe nĕṁta seduvo
gŏṁṭa vai śhrīvĕṁkaḍeśha kūḍidini nannu niṭṭĕ
daṁṭa nai jaṁkiṁ rādu tadi vachchĕ nīgunu