Eebaadi keebaadi yemta seseve

ఈపాటి కీపాటి యెంత సేసేవే
Language

(॥పల్లవి॥)
ఈపాటి కీపాటి యెంత సేసేవే
చేపట్టితే నది గొఱసేయక మానేవా

(॥ఈపా॥)
నగుతా నీ తురుము మిన్నక జారఁ దీసితేను
సగము చూపులఁ జూచి సాదించేవే
పగటున నిఁక నిన్నుఁ బట్టి పెనఁగేటి వేళ
జిగిని వీర రసాలు చిందక ఉండేవా

(॥ఈపా॥)
తప్పితారి నీ చన్నులు తగ నా చేయి దాఁకితే
ముప్పిరి నాపై బొమ్మలు ముడి వెట్టేవే
ప్పిప్పిగాఁ గౌఁగిటఁ బట్టి బిగియించే యట్టివేళ
చొప్పుల నీ మొన లెల్లాఁ జూపక వుండేవా

(॥ఈపా॥)
మనసు మర్మము సోఁక మంతనానఁ గూడితేను
వొసరి పైకొని నాపై వొళ్లు లేసేవే
ఘన శ్రీ వేంకటేశుఁడ గన నేఁ గొసరేవేళ
తనిసి వుపరిసురతాన మించ కుండేవా

(||pallavi||)
ībāḍi kībāḍi yĕṁta seseve
sebaṭṭide nadi gŏṟaseyaga mānevā

(||ībā||)
nagudā nī turumu minnaga jāram̐ dīsidenu
sagamu sūbulam̐ jūsi sādiṁcheve
pagaḍuna nim̐ka ninnum̐ baṭṭi pĕnam̐geḍi veḽa
jigini vīra rasālu siṁdaga uṁḍevā

(||ībā||)
tappidāri nī sannulu taga nā seyi dām̐kide
muppiri nābai bŏmmalu muḍi vĕṭṭeve
ppippigām̐ gaum̐giḍam̐ baṭṭi bigiyiṁche yaṭṭiveḽa
sŏppula nī mŏna lĕllām̐ jūbaga vuṁḍevā

(||ībā||)
manasu marmamu som̐ka maṁtanānam̐ gūḍidenu
vŏsari paigŏni nābai vŏḽlu leseve
ghana śhrī veṁkaḍeśhum̐ḍa gana nem̐ gŏsareveḽa
tanisi vubarisuradāna miṁcha kuṁḍevā