Ee yimtivalla nerami imchugamtaina nunnadaa

ఈ యింతివల్ల నేరమి ఇంచుకంతైన నున్నదా
Language

(॥పల్లవి॥)
ఈ యింతివల్ల నేరమి ఇంచుకంతైన నున్నదా
చేయి చాఁచఁగా నీతో సిగ్గువడరాదా

(॥ఈయిఁ॥)
చెలి నిన్నుఁ దప్పక చూచెనంటానే తగిలేవు
సొలసి నీవు దిట్టఁగాఁ జూడవద్దా
నలిరేఁగి నీతోను నవ్వెనంటాఁబై కొనేవు
గిలిగించఁగాఁ గిలకిల నవ్వరాదా

(॥ఈయిం॥)
సతి మాటలాడెనంటా సారెసారెఁ బొదిగేవు
కత చెప్పఁగా మారుగత వద్దా
తతితో జంకించెనంటా తమకించఁజూచేవు
రతి మర్మ మంటఁగా బిరాన జంకించరాదా

(॥ఈయి॥)
కాంత నీకు మొక్కెనంటా కాఁగిలించి కూడితివి
పంతపుఁబతికి మొక్కఁ బాడిగాదా
ఎంతైనా శ్రీవేంకటేశ ఇద్దరి కిద్దరే సరి
యింత నీవు మన్నించితే యియ్యకొనవలదా

(||pallavi||)
ī yiṁtivalla nerami iṁchugaṁtaina nunnadā
seyi sām̐sam̐gā nīdo sigguvaḍarādā

(||īyim̐||)
sĕli ninnum̐ dappaga sūsĕnaṁṭāne tagilevu
sŏlasi nīvu diṭṭam̐gām̐ jūḍavaddā
nalirem̐gi nīdonu navvĕnaṁṭām̐bai kŏnevu
giligiṁcham̐gām̐ gilagila navvarādā

(||īyiṁ||)
sadi māḍalāḍĕnaṁṭā sārĕsārĕm̐ bŏdigevu
kada sĕppam̐gā mārugada vaddā
tadido jaṁkiṁchĕnaṁṭā tamagiṁcham̐jūsevu
radi marma maṁṭam̐gā birāna jaṁkiṁcharādā

(||īyi||)
kāṁta nīgu mŏkkĕnaṁṭā kām̐giliṁchi kūḍidivi
paṁtabum̐badigi mŏkkam̐ bāḍigādā
ĕṁtainā śhrīveṁkaḍeśha iddari kiddare sari
yiṁta nīvu manniṁchide yiyyagŏnavaladā