(॥పల్లవి॥)
ఈ యీ యీ యీ యీ యీ
యీ యీ యీరీతి నా గుణము నాయందే తగిలెను
(॥ఈయీ॥)
మనస్సుననే నినుఁ దలఁచి మాటలఁ గొసరుదును వొక్కొకపరి
వినయముతో నీకు వేవేలు మొక్కులు మొక్కుదును వొక్కొకపరి
ఘనంబగు భక్తిని బయలుకౌఁగిట నలముదును వొక్కొకపరి
తనియక వేడుకతోను దైవమా నినుఁ బొగడుదును
(॥ఈయీ॥)
జగత్తున నే నిను వెదకి సారెకు నవ్వుదును వొక్కొకపరి
పగటున నీ నామములు పాడుచుఁ జెలఁగుదును
తగులుచు నినుఁ బూజించి తగఁ బ్రియమునఁ జొక్కుదును వొక్కొకపరి
నిగమములను నిన్ను విని నీరజనాభా వెఱగందుదును
(॥ఈయీ॥)
అంతట నీ మహిమ గని అటు నీ దాస్యమె కొరుదును వొక్కొకపరి
చెంతల నీ దాసులఁ జూచి సేవ సేసి నిను నడుగుదును వొక్కొకపరి
అంతరంగము శ్రీవేంకటేశ అలమేల్మంగతోఁ బొడచూపితివి
సంతసమున నే నీ పాదములకు శరణుచొచ్చి నేబ్రదికితిని
(||pallavi||)
ī yī yī yī yī yī
yī yī yīrīdi nā guṇamu nāyaṁde tagilĕnu
(||īyī||)
manassunane ninum̐ dalam̐si māḍalam̐ gŏsarudunu vŏkkŏgabari
vinayamudo nīgu vevelu mŏkkulu mŏkkudunu vŏkkŏgabari
ghanaṁbagu bhaktini bayalugaum̐giḍa nalamudunu vŏkkŏgabari
taniyaga veḍugadonu daivamā ninum̐ bŏgaḍudunu
(||īyī||)
jagattuna ne ninu vĕdagi sārĕgu navvudunu vŏkkŏgabari
pagaḍuna nī nāmamulu pāḍusum̐ jĕlam̐gudunu
tagulusu ninum̐ būjiṁchi tagam̐ briyamunam̐ jŏkkudunu vŏkkŏgabari
nigamamulanu ninnu vini nīrajanābhā vĕṟagaṁdudunu
(||īyī||)
aṁtaḍa nī mahima gani aḍu nī dāsyamĕ kŏrudunu vŏkkŏgabari
sĕṁtala nī dāsulam̐ jūsi seva sesi ninu naḍugudunu vŏkkŏgabari
aṁtaraṁgamu śhrīveṁkaḍeśha alamelmaṁgadom̐ bŏḍasūbidivi
saṁtasamuna ne nī pādamulagu śharaṇusŏchchi nebradigidini