ఈ విన్నపము మఱవ కింకా నీవు
(॥పల్లవి॥)
ఈ విన్నపము మఱవ కింకా నీవు
నీ వూడిగపుదాన నీ చిత్త మిఁకను
(॥ఈవి॥)
మోము చూచినవాఁడవు మెక్కించుకొన్నవాఁడవు
యీమేలే నడుపుము ఇంకా నీవు
నామనసెఱుఁగుదువు నమ్మించితివి తొల్లె
నేమము వట్టితి నీకే నీచిత్త మిఁకను
(॥ఈవి॥)
చేయువట్టితివి నీవు సెలవుల నవ్వితివి
యీయెడ నన్నుఁ బాయకు మింకా నీవు
ఆయము నీచేతిది అడియాల మిదె నాపై
నీయిచ్చలోనిదాన నీచిత్తమిఁకను
(॥ఈవి॥)
గట్టిగా నన్నుఁ గూడి కప్పురవిడె మిచ్చితి
ఇట్టె కరుణఁ జూడు మింకా నీవు
అట్టె శ్రీ వేంకటేశుఁడ నలమేలుమంగ నేను
నెట్టుకొంటి పానుపుపై నీచిత్త మిఁకను
(||pallavi||)
ī vinnabamu maṟava kiṁkā nīvu
nī vūḍigabudāna nī sitta mim̐kanu
(||īvi||)
momu sūsinavām̐ḍavu mĕkkiṁchugŏnnavām̐ḍavu
yīmele naḍubumu iṁkā nīvu
nāmanasĕṟum̐guduvu nammiṁchidivi tŏllĕ
nemamu vaṭṭidi nīge nīsitta mim̐kanu
(||īvi||)
seyuvaṭṭidivi nīvu sĕlavula navvidivi
yīyĕḍa nannum̐ bāyagu miṁkā nīvu
āyamu nīsedidi aḍiyāla midĕ nābai
nīyichchalonidāna nīsittamim̐kanu
(||īvi||)
gaṭṭigā nannum̐ gūḍi kappuraviḍĕ michchidi
iṭṭĕ karuṇam̐ jūḍu miṁkā nīvu
aṭṭĕ śhrī veṁkaḍeśhum̐ḍa nalamelumaṁga nenu
nĕṭṭugŏṁṭi pānububai nīsitta mim̐kanu