Ee vilaasambulunu yee sakkamdanamulunu

ఈ విలాసంబులును యీ చక్కఁదనములును
Language

(॥పల్లవి॥)
ఈ విలాసంబులును యీ చక్కఁదనములును
భావించి చూడ నీ పడతికే తగును

(॥ఈవి॥)
నలినాక్షి చెక్కులివి నవ్వు వెన్నెల పొలము
విలుసాముగరిడి బొమ్మలకు నొసలు
పలుకుఁజిలుకకు మోవి పంజరపు దండెంబు
నలిఁగుంతలములకాణాచి పెనుఁగొప్పు

(॥ఈవి॥)
గురు కుచము లివియే సిగ్గులకుఁ బుట్టిన ఇండ్లు
సరసముల కిరవు హస్తముల కదలు
సురత విభవముల దాఁపురమున నెయ్యపు బిరుఁదు
కరులయానముల నిలుకడ వనము తొడలు

(॥ఈవి॥)
అన్నువగు నడుము గుట్టనెడి సింహపు నెలవు
తిన్నని మొగము కళలు దేరు తెంకి
మన్నించి యేలితివి మరిగి శ్రీ వేంకటేశ
ఇన్ని సింగారముల లెనసె నీలలన

(||pallavi||)
ī vilāsaṁbulunu yī sakkam̐danamulunu
bhāviṁchi sūḍa nī paḍadige tagunu

(||īvi||)
nalinākṣhi sĕkkulivi navvu vĕnnĕla pŏlamu
vilusāmugariḍi bŏmmalagu nŏsalu
palugum̐jilugagu movi paṁjarabu daṁḍĕṁbu
nalim̐guṁtalamulagāṇāsi pĕnum̐gŏppu

(||īvi||)
guru kusamu liviye siggulagum̐ buṭṭina iṁḍlu
sarasamula kiravu hastamula kadalu
surada vibhavamula dām̐puramuna nĕyyabu birum̐du
karulayānamula nilugaḍa vanamu tŏḍalu

(||īvi||)
annuvagu naḍumu guṭṭanĕḍi siṁhabu nĕlavu
tinnani mŏgamu kaḽalu deru tĕṁki
manniṁchi yelidivi marigi śhrī veṁkaḍeśha
inni siṁgāramula lĕnasĕ nīlalana