Ee vanidavaamdavo neevaa vanidavaamdavo

ఈ వనితవాఁడవో నీవా వనితవాఁడవో
Language

(॥పల్లవి॥)
ఈ వనితవాఁడవో నీవా వనితవాఁడవో
చేవదేర నొకమాట చెప్పరాదా మాకు

(॥ఈవనిత॥)
చెక్కు వట్టి కదలించి చిఱునవ్వు నవ్వుతాను
మక్కువ నొక్కతెతోడ మాటలాడఁగా
అక్కడ విభుని నిన్ను నది చూచి వేరొకతె
పక్కనఁ గళలు దాఁకీ భావరతి గరఁగే

(॥ఈవనిత॥)
తేలగిలఁ జూచి చొక్కుఁడే నెల్లా కెమ్మీవి నిచ్చి
కాలిమీఁదఁ గాలు వేసి కరఁగించఁగా
ఆలకించి వేరొకతె అద్దరిపాటునవచ్చి
మేలుగల మిమ్ముఁ జూచి మేను పులకించెను

(॥ఈవనిత॥)
చెవిలో నేకాంతవడి సిగ్గుదేరఁ గౌఁగిలించి
పవళిం చొక్కతెతోఁ దెప్పలఁదేలఁగా
యివల శ్రీవేంకటేశ యిద్దరికి నూడిగము
తవిలి సేసి యొకతె తమకించి కూడెను

(||pallavi||)
ī vanidavām̐ḍavo nīvā vanidavām̐ḍavo
sevadera nŏgamāḍa sĕpparādā māgu

(||īvanida||)
sĕkku vaṭṭi kadaliṁchi siṟunavvu navvudānu
makkuva nŏkkadĕdoḍa māḍalāḍam̐gā
akkaḍa vibhuni ninnu nadi sūsi verŏgadĕ
pakkanam̐ gaḽalu dām̐kī bhāvaradi garam̐ge

(||īvanida||)
telagilam̐ jūsi sŏkkum̐ḍe nĕllā kĕmmīvi nichchi
kālimīm̐dam̐ gālu vesi karam̐giṁcham̐gā
ālagiṁchi verŏgadĕ addaribāḍunavachchi
melugala mimmum̐ jūsi menu pulagiṁchĕnu

(||īvanida||)
sĕvilo negāṁtavaḍi sigguderam̐ gaum̐giliṁchi
pavaḽiṁ sŏkkadĕdom̐ dĕppalam̐delam̐gā
yivala śhrīveṁkaḍeśha yiddarigi nūḍigamu
tavili sesi yŏgadĕ tamagiṁchi kūḍĕnu