ఈ వనిత నీకె తగు నెంత భాగ్యమంతురాలో
(॥పల్లవి॥)
ఈ వనిత నీకె తగు నెంత భాగ్యమంతురాలో
వేవేలు తెరఁగుల వెలసీ నీ కాఁగిట
(॥ఈవ॥)
జక్కవ పిట్టలలలోని చక్కఁదనాలు చన్నులు
నిక్కుఁగొప్పు రంగైన నీలాల పుట్టు
ముక్కు సంపెంగపువ్వుల మోహన సింగారము
యెక్కడ గాఁ బొగడేము యీయింతి సొబగులు
(॥ఈవ॥)
చిగురుటాకుల మించు చలువము కెమ్మోవి
మొగము చంద్రకళలమునిముంగిలి
జగిగలనెన్నడుము సింహపుఁగొదమ యొప్ప
తగ నెట్టు పోలిచేము తరుణి యంగములు
(॥ఈవ॥)
మరుని బండికండ్ల మహిములు పిరుఁదులు
సరిఁ బాదములు జలజపు సొంపులు
నిరతి శ్రీవేంకటేశ నీదేవు లలమేల్మంగ
అరుదు లేమని చెప్పే మతివ చందములు
(||pallavi||)
ī vanida nīgĕ tagu nĕṁta bhāgyamaṁturālo
vevelu tĕram̐gula vĕlasī nī kām̐giḍa
(||īva||)
jakkava piṭṭalalaloni sakkam̐danālu sannulu
nikkum̐gŏppu raṁgaina nīlāla puṭṭu
mukku saṁpĕṁgabuvvula mohana siṁgāramu
yĕkkaḍa gām̐ bŏgaḍemu yīyiṁti sŏbagulu
(||īva||)
siguruḍāgula miṁchu saluvamu kĕmmovi
mŏgamu saṁdragaḽalamunimuṁgili
jagigalanĕnnaḍumu siṁhabum̐gŏdama yŏppa
taga nĕṭṭu polisemu taruṇi yaṁgamulu
(||īva||)
maruni baṁḍigaṁḍla mahimulu pirum̐dulu
sarim̐ bādamulu jalajabu sŏṁpulu
niradi śhrīveṁkaḍeśha nīdevu lalamelmaṁga
arudu lemani sĕppe madiva saṁdamulu