ఈ తగవులడుగుమా యెవ్వరినైనా నీవు
(॥పల్లవి॥)
ఈ తగవులడుగుమా యెవ్వరినైనా నీవు
చేతికి లోనై ఇంతిఁ జేకొనరాదా
(॥ఈత॥)
ఆకెమోము నీవుచూచి అట్టే వూరకుడితేను
రేకలుగ వలపులు రేఁగకుండునా
చేకొని యంగన నింత చేసినవాఁడవు నేఁడు
దాకొని పెండ్లాడుటకు తగులు గాదా
(॥ఈత॥)
వొంటినొకమాటు నవ్వి వొద్దికఁ బరాకైతే
అంటుకొని చుట్టిరికమందకుండునా
వొంటెనంటా వెలఁదిపై నొల వేసినవాఁడవు
జంటై వావులకు నిదే సంచకరువు గాదా
(॥ఈత॥)
కందువఁ గాఁగిటఁ గూడి కడుసిగ్గులు వడితే
అందలి జీరలు మెఱయక వుండునా
పొంది శ్రీవేంకటేశ యీ పొలిఁతిపాలివాఁడవు
ఇందుఁ గట్టిన కంకణమిదియే కాదా
(||pallavi||)
ī tagavulaḍugumā yĕvvarinainā nīvu
sedigi lonai iṁtim̐ jegŏnarādā
(||īda||)
āgĕmomu nīvusūsi aṭṭe vūraguḍidenu
regaluga valabulu rem̐gaguṁḍunā
segŏni yaṁgana niṁta sesinavām̐ḍavu nem̐ḍu
dāgŏni pĕṁḍlāḍuḍagu tagulu gādā
(||īda||)
vŏṁṭinŏgamāḍu navvi vŏddigam̐ barāgaide
aṁṭugŏni suṭṭirigamaṁdaguṁḍunā
vŏṁṭĕnaṁṭā vĕlam̐dibai nŏla vesinavām̐ḍavu
jaṁṭai vāvulagu nide saṁchagaruvu gādā
(||īda||)
kaṁduvam̐ gām̐giḍam̐ gūḍi kaḍusiggulu vaḍide
aṁdali jīralu mĕṟayaga vuṁḍunā
pŏṁdi śhrīveṁkaḍeśha yī pŏlim̐tibālivām̐ḍavu
iṁdum̐ gaṭṭina kaṁkaṇamidiye kādā