ఈ తగవు నీమతిలో నెంచుకోవద్దా
(॥పల్లవి॥)
ఈ తగవు నీమతిలో నెంచుకోవద్దా
కాతరాన నీవు మమ్ముఁ గదియఁగఁజెల్లునా
(॥ఈత॥)
వేడుకకు నేఁ దిట్టితే వెంగెము సేసుకొందురా
ఆడుకొనేరా నిన్ను నవ్వలివారు
పాడితో నింత సిబ్బితిపడేవాఁడవైతేను
వోడక మోవెంగిలికి నొగ్గ నీకుఁ జెల్లునా
(॥ఈత॥)
నగుటా గోరగీరితే నాతో వాదింతురా
అగడుసేసేరా నిన్ను నవ్వలివారు
వొగి నీ వింతపనికి నోపనివాఁడ వైతేను
మిగులా రతులఁ గిందుమీఁదుపడఁజెల్లునా
(॥ఈత॥)
చేయివట్టి నేఁదీసితే శిరసిటే వంతురా
ఆయెడఁ బంగించేరా అవ్వలివారు
యీయెడ నన్నుఁ గూడితి వింతవాసివాఁడవు
చాయ శ్రీవేంకటేశ చన్నులంటఁజెల్లునా
(||pallavi||)
ī tagavu nīmadilo nĕṁchugovaddā
kādarāna nīvu mammum̐ gadiyam̐gam̐jĕllunā
(||īda||)
veḍugagu nem̐ diṭṭide vĕṁgĕmu sesugŏṁdurā
āḍugŏnerā ninnu navvalivāru
pāḍido niṁta sibbidibaḍevām̐ḍavaidenu
voḍaga movĕṁgiligi nŏgga nīgum̐ jĕllunā
(||īda||)
naguḍā goragīride nādo vādiṁturā
agaḍuseserā ninnu navvalivāru
vŏgi nī viṁtabanigi nobanivām̐ḍa vaidenu
migulā radulam̐ giṁdumīm̐dubaḍam̐jĕllunā
(||īda||)
seyivaṭṭi nem̐dīside śhirasiḍe vaṁturā
āyĕḍam̐ baṁgiṁcherā avvalivāru
yīyĕḍa nannum̐ gūḍidi viṁtavāsivām̐ḍavu
sāya śhrīveṁkaḍeśha sannulaṁṭam̐jĕllunā