Ee suddulu vinnavimchu meṟamgademo taanu

ఈ సుద్దులు విన్నవించు మెఱఁగడేమో తాను
Language

(॥పల్లవి॥)
ఈ సుద్దులు విన్నవించు మెఱఁగడేమో తాను
వేసరక రమ్మనవే విచారించుఁ బనులు

(॥ఈసు॥)
తమ్మి చందురునితోడ డాకొని యేకాంతమాడె
యిమ్ముల సూర్యుఁ డంతలో యెండలుగాసె
కమ్మర నందుకుఁ గానే కప్పుకొనే మేఘము
రమ్మనవే చూచుఁగాని రమణుని నీడకు

(॥ఈసు॥)
వట్టివేసగిని గాలివానలు గురియఁగఁ జొచ్చె
పట్టపగలు చీఁకటిపంట పండెను
చుట్టుక మరునమ్ములు సురసుర సుక్కెనవె
ఱట్టుసేయక పతిని ఇట్టె రమ్మనవే

(॥ఈసు॥)
పొదిగొన్నతీగెలు పూచి పుప్పొడి రాలె
యెదిరించి చకోరము లింపుసొంపెక్కె
ఇదివో శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
కదిసినాఁ డిట్లానే కమ్మటి రమ్మనవే

(||pallavi||)
ī suddulu vinnaviṁchu mĕṟam̐gaḍemo tānu
vesaraga rammanave visāriṁchum̐ banulu

(||īsu||)
tammi saṁdurunidoḍa ḍāgŏni yegāṁtamāḍĕ
yimmula sūryum̐ ḍaṁtalo yĕṁḍalugāsĕ
kammara naṁdugum̐ gāne kappugŏne meghamu
rammanave sūsum̐gāni ramaṇuni nīḍagu

(||īsu||)
vaṭṭivesagini gālivānalu guriyam̐gam̐ jŏchchĕ
paṭṭabagalu sīm̐kaḍibaṁṭa paṁḍĕnu
suṭṭuga marunammulu surasura sukkĕnavĕ
ṟaṭṭuseyaga padini iṭṭĕ rammanave

(||īsu||)
pŏdigŏnnadīgĕlu pūsi puppŏḍi rālĕ
yĕdiriṁchi sagoramu liṁpusŏṁpĕkkĕ
idivo śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
kadisinām̐ ḍiṭlāne kammaḍi rammanave