ఈ సుద్దు లెఱుఁగుదునా యిల్లాల నేను
(॥పల్లవి॥)
ఈ సుద్దు లెఱుఁగుదునా యిల్లాల నేను
నా సరుస నుండి యేమి నవ్వేవు నీవు
(॥ఈసు॥)
నేమముతోఁ గాచుకుండి నీ కొలువు సేసె నీకె
యేమి వోజలు నేర్పెనో యిందాఁకా నీకు
గామిడివి నీవు దొల్లె కతలకారి యాపె
నామోము చూచి యేల నవ్వేవు నీవు
(॥ఈసు॥)
చనవరై పొస్తకాలు చదువుతానుండె నీకె
మనసెందు మరపెనో మచ్చికె నీకు
యెనయ నాసోదకాఁడ వేల యింపులాఁడి యీకె
ననిచి నాతో నేమి నవ్వేవు నీవు
(॥ఈసు॥)
పానుపుపై నీవుండఁగా పాదాలు పిసికె నీకె
పూని యెంతలయించెనో పొందుల నీకె
అనుక శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
నానఁబెట్టి నీతో నెంత నవ్వేవు నీవు
(||pallavi||)
ī suddu lĕṟum̐gudunā yillāla nenu
nā sarusa nuṁḍi yemi navvevu nīvu
(||īsu||)
nemamudom̐ gāsuguṁḍi nī kŏluvu sesĕ nīgĕ
yemi vojalu nerbĕno yiṁdām̐kā nīgu
gāmiḍivi nīvu dŏllĕ kadalagāri yābĕ
nāmomu sūsi yela navvevu nīvu
(||īsu||)
sanavarai pŏstagālu saduvudānuṁḍĕ nīgĕ
manasĕṁdu marabĕno machchigĕ nīgu
yĕnaya nāsodagām̐ḍa vela yiṁpulām̐ḍi yīgĕ
nanisi nādo nemi navvevu nīvu
(||īsu||)
pānububai nīvuṁḍam̐gā pādālu pisigĕ nīgĕ
pūni yĕṁtalayiṁchĕno pŏṁdula nīgĕ
anuga śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
nānam̐bĕṭṭi nīdo nĕṁta navvevu nīvu