Ee sobagu lesadamgala veebe yamde kaaga

ఈ సొబగు లెచటఁగల వీపె యందే కాక
Language

(॥పల్లవి॥)
ఈ సొబగు లెచటఁగల వీపె యందే కాక
వాసివంతుల నీకెను వర్ణింప వసమా

(॥ఈసొ॥)
అతివ పద్మినిగనక యలికుంతలి యనదగు
సితచంద్రముఖిగాన జిగిఁ జకోరాక్షి యగు
తతిఁ బువ్వుఁబోడిఁగన తగులుఁ బికవాణి యన
చతురబిసహస్తగన శంఖగళ యగును

(॥ఈసొ॥)
హరిమధ్యగన చెలియ ద్రికుచ యనదగును
గరిమ నాభి సరసిగన వళితరంగ యగు
వురుచక్రజఘనగన యూరుయుగ యనదగును
గురుహంసయానగన కూర్మపద యగును

(॥ఈసొ॥)
కలిత కనకాంగిగన కాంతమణినఖ యగును
జలధి గంభీరగన సరసామృతాదర యగు
యెలమి శ్రీ వేంకటేశుఁ డెనసెఁగన సిరియగును
కలిత శృంగారగన కల్యాణి యగును

(||pallavi||)
ī sŏbagu lĕsaḍam̐gala vībĕ yaṁde kāga
vāsivaṁtula nīgĕnu varṇiṁpa vasamā

(||īsŏ||)
adiva padminiganaga yaliguṁtali yanadagu
sidasaṁdramukhigāna jigim̐ jagorākṣhi yagu
tadim̐ buvvum̐boḍim̐gana tagulum̐ bigavāṇi yana
sadurabisahastagana śhaṁkhagaḽa yagunu

(||īsŏ||)
harimadhyagana sĕliya drigusa yanadagunu
garima nābhi sarasigana vaḽidaraṁga yagu
vurusakrajaghanagana yūruyuga yanadagunu
guruhaṁsayānagana kūrmabada yagunu

(||īsŏ||)
kalida kanagāṁgigana kāṁtamaṇinakha yagunu
jaladhi gaṁbhīragana sarasāmṛtādara yagu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍĕnasĕm̐gana siriyagunu
kalida śhṛṁgāragana kalyāṇi yagunu