Ee sanavu lee valabu lemdum gannavi gaavu

ఈ చనవు లీ వలపు లెందుఁ గన్నవి గావు
Language

(॥పల్లవి॥)
ఈ చనవు లీ వలపు లెందుఁ గన్నవి గావు
చేచేతఁ దప మెంత చేసెనో చెలియా

(॥ఈచన॥)
పడఁతి తనవదనమున బాగాలు నించిఁ నీ
వెడనెడల నాకు మడిచి యియ్యఁగాను
తొడమీఁదఁ దొడ వేసి తొదలు మాటాడి, నీ
కడ చూచె నిది యెంత కలికియో కాని

(॥ఈచన॥)
బంగారుమేడలో వరపుపై చెలికి, నీ
వంగములఁ గస్తూరి యలఁదఁగాను
ముంగయి మురువులు నీ ముంజేత నిడి, మోవి
యెంగిలిగాఁ జేసె నిది యెంతటిదో కాని

(॥ఈచన॥)
నిండు రాజసముతో నీమీఁద నొరగుకొని
అండనే నీవు తను నలమఁగాను
బెండుపడి రతి నిన్నుఁ బెనఁగె శ్రీవేంకటేశ
కొండగొనె నిది యెంత కూర్మియో కాని

(||pallavi||)
ī sanavu lī valabu lĕṁdum̐ gannavi gāvu
sesedam̐ daba mĕṁta sesĕno sĕliyā

(||īsana||)
paḍam̐ti tanavadanamuna bāgālu niṁchim̐ nī
vĕḍanĕḍala nāgu maḍisi yiyyam̐gānu
tŏḍamīm̐dam̐ dŏḍa vesi tŏdalu māḍāḍi, nī
kaḍa sūsĕ nidi yĕṁta kaligiyo kāni

(||īsana||)
baṁgārumeḍalo varabubai sĕligi, nī
vaṁgamulam̐ gastūri yalam̐dam̐gānu
muṁgayi muruvulu nī muṁjeda niḍi, movi
yĕṁgiligām̐ jesĕ nidi yĕṁtaḍido kāni

(||īsana||)
niṁḍu rājasamudo nīmīm̐da nŏragugŏni
aṁḍane nīvu tanu nalamam̐gānu
bĕṁḍubaḍi radi ninnum̐ bĕnam̐gĕ śhrīveṁkaḍeśha
kŏṁḍagŏnĕ nidi yĕṁta kūrmiyo kāni