పల్లవి:
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
చరణం 1:
పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళు కలలే పండగా ||2||
చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల
చరణం 2:
పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా ||2||
నిను చేరుకోగ నునుమేని తీగ పులకించి పోయెను తొలకరి వలపుల
చరణం 3:
ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో ||2||
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె అనురాగ సీమల అంచులు దొరికే
pallavi:
ī reyi tīyanidi ī sirugāli manasainadi
ī hāyi māyanidi iṁtagu miṁchi emunnadi
evevŏ korigalu ĕdalo jhummani aṁṭunnavi
ā kŏṁṭĕ malligalu allana dāgi viṁṭunnavi
saraṇaṁ 1:
pannīḍi talabulu niṁḍagā innāḽḽu kalale paṁḍagā ||2||
sinnāri sĕliya abaraṁji kaluva serāli kaugiḍa jilibili nagavula
saraṇaṁ 2:
paruvālu pallavi pāḍagā nayanālu sayyāḍalāḍagā ||2||
ninu serugoga nunumeni tīga pulagiṁchi poyĕnu tŏlagari valabula
saraṇaṁ 3:
ĕnnĕnni janmala baṁdhamo e pūla nomula puṇyamo ||2||
ninu nannu kalibĕ nī nīḍa nilibĕ anurāga sīmala aṁchulu dŏrige